యంగ్ టైగ‌ర్ ఖాతాలో మ‌రో అరుదైన ఆస్కార్ రికార్డు!

ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్ కు చోటు లభించింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది.

Update: 2023-10-19 15:07 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఎంత‌టి ప్ర‌తిభావంతుడో చెప్పాల్సిన ప‌నిలేదు. సీనియ‌ర్ ఎన్టీఆర్..న‌ట‌సింహ బాల‌కృష్ణ త‌ర్వాత ఆ కుటుంబం నుంచి అగ్ర హీరోగా ఎదిగిన న‌టుడు. ఎలాంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు. అందుకే అన్ని గొప్ప విజ‌య‌వంత‌మైన చిత్రాలు అభిమానుల‌కు అందించ‌గ లిగాడు. దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అభిమాన హీరో అయ్యాడు. ఇక 'ఆర్ ఆర్ ఆర్' సినిమా అత‌ని ఖ్యాతి ఖండాలే దాటిపోయింది.

తార‌క్ పెర్పార్మెన్స్ ని హాలీవుడ్ దిగ్గ‌జాలే ప్ర‌శంసించారు. హాలీవుడ్ అవ‌కాశాలు సైతం క్యూలో ఉన్నాయి. నాటు నాటు పాట‌కు ఆస్కార్ అవార్డు రావ‌డం ఆయ‌న స్థాయిని మ‌రింత పెచింది. ఇప్ప‌టికే జాతీయ‌..రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్న తారక్ కి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్రతిష్ఠాత్మక 'ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్'లో తారక్ కు చోటు లభించింది. 'ది అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్' కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ లో తారక్ కు స్థానం కల్పించింది.

ఈ ఏడాదికి గాను ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఐదుగురు నటులకు చోటు దక్కింది. వీరిలో తారక్ తో పాటు కే హుయ్ క్వాన్, కెర్రీ కాండన్, రోసా సలాజర్, మార్షా స్టెఫానీ బ్లేక్ ఉన్నారు. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న తారక్ పై టాలీవుడ్ తో పాటు దేశంలోని ఇతర సినీ పరిశ్రమల నుంచి ప్రశంసలు వెల్లువె త్తుతున్నాయి. దీంతో తారక్ అభిమానుల ఆనందం అంబరాన్ని అంటుతోంది.

తార‌క్ ప్ర‌తిభ‌కి ఇలాంటి అవార్డులు మ‌రిన్ని వ‌రిస్తాయ‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. భ‌విష్య‌త్ లో ఇంకా గొప్ప స్థాయికి చేరుకునే స‌త్తా ఉన్న న‌టుడ‌ని ప్ర‌శంసిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో 'దేవ‌ర‌'లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచనాలు ప‌తాక స్థాయిలో ఉన్నాయి.

Tags:    

Similar News