చరణ్, తారక్… ఇద్దరు ఒకే లైన్ తో..

ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలోనే ఉన్నాయి.

Update: 2024-07-15 12:30 GMT

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ గా మారిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సోలోగా తమ మార్కెట్ ని దేశ వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్నారు. హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ చేస్తున్నారు. ఇది కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధం అవుతోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ చివరి దశలోనే ఉన్నాయి.

ఇద్దరు కూడా మేగ్జిమమ్ 2-3 నెలల గ్యాప్ లోనే తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. ఇదిలా ఉంటే యాదృశ్చికంగా జరిగిన ఇప్పుడు చరణ్, తారక్ సినిమాల బేసిక్ స్టోరీ లైన్ ఒకే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమాలో తండ్రికి జరిగిన నమ్మకద్రోహానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా చరణ్ నటించారు. దేవర మూవీలో కూడా ఫ్లాష్ బ్యాక్ లో ఇదే ప్లాట్ ఉంటుందంట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు.

అలాగే తారక్ కూడా డ్యూయల్ రోల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల బ్యాక్ డ్రాప్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. దేవర సినిమాని పీరియాడికల్ జోనర్ లో కొరటాల శివ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లో పీరియాడిక్ టచ్ తో పాటు ప్రెజెంట్ లో కథ నడుస్తుంది. అలాగే ఈ రెండు సినిమాలలో చరణ్, తారక్ రెండు భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. దీంతో గేమ్ చేంజర్, దేవర సినిమాలని ఫ్యాన్స్ పోల్చి చూస్తున్నారు.

ఈ రెండు సినిమాల మీద ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు కావడంతో ఫ్యాన్స్ ఈ చిత్రాల కోసం క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అయితే రాజమౌళితో మూవీ చేసాక ఏ హీరోకి అయిన డిజాస్టర్ వస్తుంది. ఇది సెంటిమెంట్ గా మారిపోయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ కి ఆచార్య రూపంలో డిజాస్టర్ పడింది. దీని తర్వాత గేమ్ చేంజర్ వస్తోంది.

తారక్ మాత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత డైరెక్ట్ గా దేవరతోనే రాబోతున్నాడు. అయితే రెండేళ్లు గ్యాప్ తీసుకొని దేవరని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడంతో ఆర్ఆర్ఆర్ సినిమా ఇంపాక్ట్ దేవరపై పడే ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు. కచ్చితంగా ఈ ఇద్దరు స్టార్స్ కి తాము చేస్తోన్న సినిమాలతో సక్సెస్ లు వస్తేనే పాన్ ఇండియా లెవల్ లో మార్కెట్ స్టాండర్డ్ అవుతుంది. లేదంటే మళ్ళీ ఆర్ఆర్ఆర్ ఇచ్చిన హైప్ ని అందుకోవడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News