సలార్ సెంటిమెంటుతో OG హోప్స్

ఈ క్యారెక్టర్ లో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంటుంది. అద్భుతంగా విలనిజం పండించిన శ్రియారెడ్డిపై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. దీంతో ఆమె ట్రెండింగ్ లో నడుస్తోంది.

Update: 2023-12-25 04:00 GMT

డార్లింగ్ ప్రభాస్ సలార్ మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేశాడు. అందులో మొదటి ఆట నుంచి పర్వాలేదనే టాక్ తో నడుస్తోన్న సినిమా అంటే సలార్ అని చెప్పాలి. దానికి తగ్గట్లుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇదే స్పీడ్ కొనసాగితే ప్రభాస్ ఖాతాలో మరో వెయ్యి కోట్ల కలెక్షన్స్ చిత్రంగా సలార్ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చింది. అలాగే ప్రతి పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్ ఆయా పాత్రలని అంత అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో శ్రియారెడ్డి కీలక పాత్రలో నటించింది. విశాల్ పొగరు మూవీలో నటించిన శ్రియారెడ్డి అందరికి గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు విశాల్ అన్నని పెళ్లి చేసుకొని వాటి ఇంటి కోడలైపోయింది.

తెలుగమ్మాయి అయినా శ్రియారెడ్డి తమిళ్ సినిమాలద్వారానే పాపులారిటీ తెచ్చుకుంది. విశాల్ బ్రదర్ విక్రమ్ రెడ్డిని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్లు సినిమాలకి దూరంగా ఉంది. మరల రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టింది. అయితే సలార్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె నటించి అందరిని మెప్పించింది.

ఈ క్యారెక్టర్ లో విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంటుంది. అద్భుతంగా విలనిజం పండించిన శ్రియారెడ్డిపై ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. దీంతో ఆమె ట్రెండింగ్ లో నడుస్తోంది. శ్రియా రెడ్డి తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో కూడా కీలక పాత్రలో నటిస్తోంది. సలార్ పాజిటివ్ టాక్ రావడం, శ్రియా రెడ్డి క్రియేటర్ కి మంచి పేరు రావడం ఓజీ సినిమాకి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కెరియర్ లో పాన్ ఇండియా రేంజ్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోమాఫియా కథతో ఓజీ సినిమా సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపొయింది. ఏపీ ఎన్నికల తర్వాత మిగిలిన పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. శ్రియా రెడ్డిఇమేజ్ ఓజీ సినిమా కి ఏ మేరకు హెల్ప్ అయ్యి హైప్ తీసుకొస్తుంది అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News