పవన్ కళ్యాణ్ OG.. కర్ణాటక డీల్ గట్టిగానే..
ఇదిలా ఉంటే ఈ సినిమా కర్ణాటక రైట్స్ ఏకంగా 20 కోట్లకి అమ్ముడయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇతర భాషలకి సంబందించిన రైట్స్ పైన డిస్కసన్స్ నడుస్తున్నాయంట.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న మూవీ ఓజీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తోన్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రియాంక ఆరుళ్ మోహన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వేడి ఉండటంతో పవన్ కళ్యాణ్ అన్ని షూటింగ్స్ పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ చేశారు. ఎన్నికల తర్వాత మరల పెండింగ్ సినిమా షూటింగ్ లు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ముందుగా ఓజీ సినిమాని పూర్తి చేసే చేయడానికి పవన్ కళ్యాణ్ ఫోకస్ చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
కచ్చితంగా పవర్ స్టార్ కెరియర్ లో బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కర్ణాటక రైట్స్ ఏకంగా 20 కోట్లకి అమ్ముడయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఇతర భాషలకి సంబందించిన రైట్స్ పైన డిస్కసన్స్ నడుస్తున్నాయంట.
ఇక ఈ సినిమాని ఈ ఏడాది దసరాకి రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ లేదా మే నాటికి ఎన్నికలు అయిపోతే జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేసే ప్లాన్ లో సుజిత్ ఉన్నారు. వీలైనంత వేగంగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి అక్టోబర్ 12 నాటికి మూవీని థియేటర్స్ లోకి తెసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.
ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఒజాస్ గంభీర అనే ఒక కరుడుగట్టిన గ్యాంగ్ స్టార్ గా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. అతని పాత్ర చాలా భిన్నంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది.