ఓజీ.. ఈ సడెన్ ట్విస్ట్ ఏంటి?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే.

Update: 2024-05-30 06:42 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. చెప్పాలంటే ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్, గ్లింప్స్ అభిమానులకు పిచ్చెక్కించాయి. డైరెక్టర్ సుజిత్ స్టైలిష్ టేకింగ్.. మూవీపై అంచనాలు పెంచుతూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్.. పవన్ ఏపీ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల హోల్డ్ లో పడింది. జూన్ లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎప్పుడు అనేది తెలియదు.

పవన్ ఒక్కసారి డేట్లు ఇస్తే ఈ సారి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేలా ఉన్నారు సుజిత్. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ చాలా మంది ఈ మూవీ విడుదల వాయిదా పడుతుందని ఎప్పటి నుంచో అంటున్నారు. తాజాగా ఓ మూవీ అప్డేట్ వల్ల ఓజీ పోస్ట్ పోన్ అయనట్లే ఉందని చెబుతున్నారు. అసలేం జరిగిందంటే?

మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ డేట్ ను లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ.. సెప్టెంబర్ 27 వ తేదీనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పవన్ ఫాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓజీ నిజంగా వాయిదా పడుతుందా? అందుకే అదే రోజు లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

అయితే నాగ వంశీకి పవన్ కు మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి పవన్ ఓజీ మేకర్స్ ను సంప్రదించాకే లక్కీ భాస్కర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసి ఉంటారని అంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ.. 90's లో జరిగిన ఆర్థిక నేరాల నేపథ్యంలో సాగుతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.

మరోవైపు, ఇటీవల సుజిత్.. ఓజీ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తనకు, పవన్ కళ్యాణ్‌ కు జపనీస్ చిత్రాలంటే బాగా ఇష్టమని చెప్పారు. ఓజీ మూవీలో ఒజాస్ గంభీర అనేది కారెక్టర్ పేరు అని చెప్పి మంచి హైప్ క్రియేట్ చేశారు. ఇది జరిగిన మూడు రోజులకే మూవీ రిలీజ్ కు సంబంధించి వార్తలు రావడంతో పవన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక క్లారిటీ ఇవ్వండన్న అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పవన్ ఓజీ రిలీజ్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News