వైరల్‌ వీడియో : బామ్మల కిస్సిక్‌ డాన్స్‌ అదిరింది

దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నాలుగు రోజుల్లో దాదాపుగా రూ.750 కోట్ల వసూళ్లను మించి రాబట్టింది అంటూ ప్రచారం జరుగుతోంది.

Update: 2024-12-09 05:24 GMT

దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నాలుగు రోజుల్లో దాదాపుగా రూ.750 కోట్ల వసూళ్లను మించి రాబట్టింది అంటూ ప్రచారం జరుగుతోంది. గంటకు లక్ష టికెట్ల చొప్పున అమ్ముడు పోయాయి. సినిమాలోని అల్లు అర్జున్ నటనకు జాతీయ స్థాయి అవార్డు రావాల్సిందే అంటూ ఫ్యాన్స్ అంటూ ఉంటే రష్మిక యాక్టింగ్‌, డాన్స్‌ను ది బెస్ట్‌ అంటూ, అవార్డ్‌ విన్నింగ్‌ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇదే సమయంలో కిస్సిక్‌ సాంగ్‌ గురించి ప్రముఖంగా ఫ్యాన్స్‌ మరియు ఫాలోవర్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

అల్లు అర్జున్‌తో కలిసి శ్రీలీల కిస్సిక్ సాంగ్‌ను చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతంలో వచ్చిన ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. సినిమా విడుదలకు ముందే వచ్చిన కిస్సిక్‌ సాంగ్‌ ఏ స్థాయిలో దేశవ్యాప్తంగా ఊపు ఊపిందో అందరికీ తెలుసు. అలాంటి సూపర్‌ హిట్‌ సాంగ్‌ సోషల్‌ మీడియాలో లక్షల కొద్ది షార్ట్‌ వీడియోలుగా వైరల్‌ అవుతోంది. ఒక అమ్మాయి తిరుమల కొండ వద్ద ఈ పాటకు డాన్స్ చేసి వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. మొత్తానికి ఎక్కడ చేసినా, ఎలా చేసినా ఈ పాటతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉన్నారు.

ఇప్పుడు ఈ పాటకు కర్ణాటకకి చెందిన ఒక ఓల్డ్‌ఏజ్‌ హోంలో బామ్మలు చేసిన కిస్సిక్‌ డాన్స్‌ అదిరింది అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. 17 సెకన్ల ఈ వీడియోను లక్షల మంది చూస్తూ ఉన్నారు. బామ్మలు ఇలాంటి పాటకు డాన్స్ చేయడం, అది కూడా చాలా సింక్‌తో డాన్స్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నలుగురు బామ్మలు చేసిన ఈ డాన్స్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ వీడియోను షేర్‌ చేయడంతో మరింతగా జనాలకు చేరువ అయ్యింది.

సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ కాంబోలో వచ్చిన ప్రతి ఒక్క ఐటెం సాంగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ పాట సైతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. పుష్ప పార్ట్‌ 1 లోని ఊ అంటావా పాట స్థాయిలో శ్రీలీల ఐటెం సాంగ్ ఉంటుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. వారందరికీ సమాధానంగా ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్‌ చేస్తూ అర్థం అవుతుంది. పుష్ప 2 ఒక వైపు భారీ వసూళ్లు రాబడుతూ ఉంటే కిస్సిక్ సాంగ్‌ భారీ ఎత్తున వ్యూస్‌ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది.

Tags:    

Similar News