'ఆపరేషన్ వాలెంటైన్'... వరుణ్ కెరీర్​లోనే భారీ డీల్​

శాటిలైట్​, డిజిటల్​ స్ట్రీమింగ్​ ఆడియో సహా ఇతర హక్కులన్ని కలిపి భారీ నెంబర్ ఫిగర్​కు కొనుగోలు చేశారట. రూ.50కోట్లకు పైగా అమ్ముడుపోయిందని తెలుస్తోంది. వరుణ్ కెరీర్​లో ఇది పెద్ద డీల్​.

Update: 2023-09-28 16:30 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. పాన్ ఇండియాగా రానున్న ఈ సినిమాను.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. భారత వైమానిక దళ ధైర్య సాహసాల్ని ఆవిష్కరిస్తూ సాగే చిత్రమని చెప్పాలి. తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్​గా రిలీజ్ చేయబోతున్నారు.


భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా నాన్​ థియేట్రికల్ తాజాగా​ రైట్స్​ కళ్లు చెదిరే రేటుకు అమ్ముడు పోయాయని తెలిసింది. శాటిలైట్​, డిజిటల్​ స్ట్రీమింగ్​ ఆడియో సహా ఇతర హక్కులన్ని కలిపి భారీ నెంబర్ ఫిగర్​కు కొనుగోలు చేశారట. రూ.50కోట్లకు పైగా అమ్ముడుపోయిందని తెలుస్తోంది. వరుణ్ కెరీర్​లో ఇది పెద్ద డీల్​. ఇంకా తెలుగు హిందీలో థియేట్రికల్​ రైట్స్​కు అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయంట.

ఇది వరుణ్​కు.. తొలి హిందీ చిత్రం. వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్​గా కనిపించబోతున్నారు. అలాగే చిత్రంలో రాడార్ ఆఫీసర్ పాత్ర పోషించిన హీరోయిన్​ మానుషి చిల్లర్​కు తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్- రినైసెన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మేజర్​ లాంటి భారీ సక్సెస్​ తర్వాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్​ నిర్మిస్తున్న మరో దేశభక్తి సినిమా ఇది. సందీప్‌ ముద్ద నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. న్యాయవాదిగా ఉన్న ప్రతాప్ సింగ్.. ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో యాడ్ ఫిల్మ్​ మేకర్​గా కెరీర్ ప్రారంభించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడం కోసం సాంకేతిక హంగులతో, విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 8 ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తైపోయింది. కాగా, ఇప్పటికే వరుస ఫ్లాప్​లో ఉన్న వరుణ్ తేజ్​కు కనీసం ఈ 'ఆపరేషన్ వాలెంటైన్' అయినా హిట్ అందిస్తుందో లేదో చూడాలి..

Tags:    

Similar News