ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్.. ఆకాశంలో వరుణ్ మెరుపు దాడి
అప్పటికే ఎయిర్ ఫోర్స్ యుద్ధాలలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్న వీర సైనికుడుగా రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నట్లుగా హైలెట్ చేశారు.
మెగా హీరో వరుణ్ తేజ్ ఈసారి ఆపరేషన్ వాలెంటెన్స్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఎయిర్ ఫోర్స్ వార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 1వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను హిందీలో సల్మాన్ ఖాన్ విడుదల చేయగా తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే. అప్పటికే ఎయిర్ ఫోర్స్ యుద్ధాలలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్న వీర సైనికుడుగా రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ కనిపించబోతున్నట్లుగా హైలెట్ చేశారు. ఇక అతన్ని అదుపులో పెట్టడానికి ఉన్నతాధికారులు చేసే ప్రయత్నాలు కూడా ఈ సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. పరిస్థితులను బట్టి రుద్ర శత్రువులపై ఆకాశంలో మెరుపు దాడులు చేయడం మరొక మేజర్ హైలైట్ గా ట్రైలర్లో నిలుస్తోంది.
కొంతమంది పైలెట్స్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనే డైలాగ్ తోనే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇక ఆకాశంలో అడ్వెంచర్స్ అలవాటుగా చేసుకున్న ఈ వారియర్ ఒకవైపు దేశం కోసం పోరాడుతూనే మరొకవైపు ప్రేయసి కోసం కూడా జీవిస్తూ ఉంటాడని తెలుస్తోంది. ఎయిర్ ఫోర్స్ లో ఇలాంటి రిస్కులు చాలా కామన్ అనే డైలాగ్ కూడా అతని పాత్ర బలాన్ని తెలియజేస్తోంది.
ఇక భయమేంటో తెలియని హీరో రెడార్ లో ఉన్నంతవరకు కూడా నాకు ఏమీ అవ్వదు అనే ధీమాతో కనిపిస్తూ ఉన్నాడు. ఇక శత్రువులు దాడి చేసినప్పుడు మనం కూడా అంతే స్పీడుగా దాడి చేయాలి అని అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 14 దాడుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఆపరేషన్ వాలెంటైన్ లో నిజ జీవితంలోని అంశాలను కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
శత్రువులపై పోరాటం చేయడానికి హీరో రుద్ర ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు శత్రువులు కూడా ఎలాంటి ప్రణాళికలు రచించారు అనేది కూడా ఈ సినిమాలో ప్రధానంగా నిలువబోతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించగా సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ లో సందీప్ ఈ సినిమాను నిర్మించారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించగా సాయి మాధవ్ బుర్ర మాటలు అందించారు. తెలుగులోనే కాకుండా ఈ సినిమాలో ఒకేసారి హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.