ఈ వారం థియేటర్ - ఓటీటీ కంటెంట్ ఇదే..
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే డిసెంబర్ 15న హర్రర్ థ్రిల్లర్ మూవీ పిండం ప్రేక్షకుల ముందుకి వస్తోంది
ప్రతి వారం థియేటర్స్ లో డిఫరెంట్ లాంగ్వేజ్ లలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా వచ్చే సినిమాలలో కొన్ని సైలెంట్ హిట్స్ గా మారుతాయి. కొన్ని హెవీ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చి డిజాస్టర్ అవుతూ ఉంటాయి. అలాగే డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల ద్వారా ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాల సంగతి చూసుకుంటే డిసెంబర్ 15న హర్రర్ థ్రిల్లర్ మూవీ పిండం ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ట్రైలర్ తోనే ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. దీనికి కొంత ప్రేక్షకాదరణ ఉండే అవకాశం ఉంది. అదే రోజు కలశ అనే మరో మూవీ రిలీజ్ అవుతోంది. అలాగే బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన జోరుగా హుసారుగా మూవీ రిలీజ్ అవుతోంది.
కొత్త కుర్రాళ్ళు చేసిన తికమక తాండ మూవీ కూడా అదే రోజు థియేటర్స్ లోకి రాబోతోంది. చే(చేగువేరా బయోపిక్) కూడా రిలీజ్ అవుతోంది. ఈ చిన్న సినిమాలలో ఏది ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. ఇక ఓటీటీలోకి వస్తే అమెజాన్ ప్రైమ్ డిసెంబర్ 15న హాలీవుడ్ మూవీ రీచర్ విడుదల అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ది మిషన్ ( తెలుగు) డిసెంబర్ 10 నుంచి ప్రసారం కాబోతోంది.
డిసెంబర్ 11న డాన్స్ ప్లస్ ప్రో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ 15న మలయాళీ మూవీ ఫ్యామిలీ రిలీజ్ అవుతోంది. అదే రోజు ది ఫ్రీలాన్సర్ : కన్క్లూజన్ వెబ్ సిరీస్) స్ట్రీమింగ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో కార్తీ జపాన్ మూవీ డిసెంబర్ 11న రిలీజ్ అవుతోంది. డిసెంబర్ 12న హాలీవుడ్ మూవీస్ కెవిన్ హార్ట్ అండ్ క్రిస్ రాక్, అండర్ ప్రెజర్, కొరియన్ మూవీ సింగిల్ ఇన్‌ఫెర్నో రిలీజ్ అవుతున్నాయి.
డిసెంబర్ 13న 1670 (పోలీస్), హాలీవుడ్ మూవీ కార్ మాస్టర్స్ రష్ టు రిచెస్, డిసెంబర్ 14న హాలీవుడ్ మూవీ ద క్రోన్, డిసెంబర్ 15న హాలీవుడ్ మూవీస్ చికెన్ రన్ డాన్ ఆఫ్ ది నగ్గెట్, యో! క్రిస్మస్ ( హాలీవుడ్ ) స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో ఎన్ని ప్రేక్షకాదరణ సొంతం చేసుకొని టాప్ ట్రెండింగ్ లోకి వస్తాయనేది చూడాలి.