ఓవియా… మరో లక్కీ ఛాన్స్

ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 1లో బాగా పాపులర్ అయిన ఓవియా మరల ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Update: 2024-10-15 09:35 GMT

తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని బాగా పాపులర్ అయిన బ్యూటీ ఓవియా. కేరళకి చెందిన ఈ బ్యూటీ కోలీవుడ్ నటిగా కొనసాగుతోంది. అలాగే మలయాళీ, కన్నడ, తెలుగు భాషలలో కూడా ఓవియా హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. రెగ్యులర్ గా మూవీస్ చేస్తోన్న కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపు అయితే ఆమెకి లేదు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 1లో బాగా పాపులర్ అయిన ఓవియా మరల ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

కొద్ది రోజుల క్రితం ఓవియా లీక్డ్ వీడియో అంటూ ఒకటి సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. దీనిపై ఆమె కూడా రియాక్ట్ అవుతూ ఎంజాయ్ అంటూ పోస్ట్ చేసింది. ఓవియా డేరింగ్ గా తనపై జరుగుతున్న సోషల్ మీడియా వేధింపులని ఎదుర్కొంది. దీంతో ఆమెకి తమిళనాట సెలబ్రెటీల నుంచి మద్దతు లభిస్తోంది. అలాగే నెటిజన్లు కూడా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో హీరో లారెన్స్ ‘కాంచనా 3’ మూవీ సమయంలో ఓవియాతో దిగిన ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

ఈ ఫోటో కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. అలాగే మరో న్యూస్ కూడా తెరపైకి వచ్చింది. రాఘవ లారెన్స్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ ‘కాంచనా’ సిరీస్ లో 4వ మూవీని త్వరలో సెట్స్ పైకి తీసుకొని వెళ్లబోతున్నాడు. లారెన్స్ స్వీయ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. కాంచన సిరీస్ పై ఉన్న హైప్ నేపథ్యంలో నెక్స్ట్ రాబోయే చిత్రం పైన హైప్ క్రియేట్ అయ్యింది. ‘కాంచనా 4’ లో కూడా ఓవియాని ఒక హీరోయిన్ గా తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఆల్ మోస్ట్ ఆమెని లారెన్స్ కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. అందుకే లారెన్స్ ‘కాంచనా 3’ మూవీ షూటింగ్ లో ఆమెతో దిగిన ఫోటో షేర్ చేశారనే ప్రచారం నడుస్తోంది. ‘కాంచన 4’ ఆమె కీలక పాత్రలో చేయబోతోందని అంటున్నారు. అది ఎంత వరకు వాస్తవం అనేదానిపై అధికారికంగా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే ఓవియా తెలుగులో కూడా తరుణ్ కి జోడీగా ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది.

త్వరలో కాంచన 4 మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఓవియా ప్రస్తుతం రెండు తమిళ్ సినిమాలలో నటిస్తోంది. ఆ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. వాటిలో ‘సంభవం’ అనే సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News