మాలివుడ్ పాన్ ఇండియా ఆశలు.. దుల్కర్ పైనే..
కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం ఇంకా పాన్ ఇండియా ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో కాస్త వెనకపడే ఉందని చెప్పాలి.
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా ఈ అన్నీ భాషల్లోనూ పదుల సంఖ్యలో పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. మినిమమ్ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలు కూడా.. పాన్ ఇండియా హంగులను అద్దుకుంటూ ఇండియావైడ్‌గా హిట్ అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ముఖ్యంగా ఈ విషయంలో బడా హీరోలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫుల్ జోరు చూపిస్తున్నారు. తెలుగు దర్శకుడు రాజమౌళి(బాహుబలి, ఆర్ఆర్ఆర్) అల్లు అర్జున్(పుష్ప) వంటి వారు తెలుగు చిత్రసీమలో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో నిలబెట్టారు. ఇక కోలీవుడ్ విషయానికొస్తే.. దర్శకుడు మణిరత్నం, రజనీకాంత్, కమల్హానస్ లాంటి వారి సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజై ఆ ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచుతున్నాయి. కన్నడలో ఇప్పటికే కేజీయఫ్, కాంతారా వచ్చి సెన్సేషనల్ సృష్టించాయి.
అలా సౌత్ ఇండస్ట్రీలో ఈ మూడు ఇండస్ట్రీ చిత్రాలు పాన్ ఇండియా ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఇప్పటికే తమ సత్తా ఏంటో నిరూపించాయి. కానీ మలయాళ ఇండస్ట్రీ మాత్రం ఇంకా పాన్ ఇండియా ట్రెండ్‌ను ఫాలో అవ్వడంలో కాస్త వెనకపడే ఉందని చెప్పాలి. అక్కడ ఇంకా ఫిల్మ్ మేకర్స్ లో బడ్జెట్, సింపుల్ చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు. వారి సినిమాలు పాన్ ఇండియాను టార్గెట్ చేసుకుని రావట్లేదు.
ఆ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ మిహా ఇతర హీరోలు ఎవరూ ఇప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవ్వలేదు. ఆ మధ్యలో వచ్చిన మిన్నల్ మురళి, 2018 వంటి చిత్రాలతో టొవినో థామస్ హిట్ అందుకున్నప్పటికీ ఆ చిత్రాలు పాన్ ఇండియా టార్గెట్‌గా తెరకెక్కలేదు. దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు ఇతర భాషల్లో పనిచేశారు గానీ.. మాలీవుడ్ తరఫున డైరెక్ట్‌గా పాన్ ఇండియా చిత్రం చేయలేదు.
తొలిసారి ఇప్పుడు దుల్కర్ కింగ్ ఆఫ్ కోతా అంటూ గ్యాంగ్ స్టర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్‌గా వస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. చూడాలి మరి ఈ సినిమా దుల్కర్‌తో పాటు మాలీవుడ్‌కు ఎలాంటి హిట్‌ను అందిస్తుందో, ఇతర మాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఎలాంటి భరోసాను ఇస్తుందో... ఆ ఇండస్ట్రీని పాన్ ఇండియా రేసులో నిలబెడుతుందో లేదో.