మాల్దీవుల్లో పరిణీతి హనీమూన్ ట్రిప్
పెళ్లికి ముందు సోషల్ మీడియాల్లో ఎంతో స్పీడ్ గా ఉన్న పరిణీతి చోప్రా.. ఇటీవల కొంత నెమ్మదించింది
పెళ్లికి ముందు సోషల్ మీడియాల్లో ఎంతో స్పీడ్ గా ఉన్న పరిణీతి చోప్రా.. ఇటీవల కొంత నెమ్మదించింది. అయితే ఇప్పుడు మళ్లీ ఇన్ స్టాలో వరసగా ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. ప్రస్తుతం మాల్దీవుల పర్యటన నుంచి అద్బుతమైన ఫోటోల బంచ్ ని పారీ షేర్ చేయగా ఇవన్నీ వైరల్ గా మారాయి. అయితే ఇది హనీమూన్ ట్రిప్ అనుకోవచ్చా? అంటే.. అలాంటిదేమీ లేదని పారీ షాకిస్తోంది.
సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ హోటల్లో సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో పరిణీతి - ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా వివాహం జరిగింది. ఈ వివాహానికి చెందిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. పారీ ఈ పెళ్లితో ఫుల్ హ్యాపీ మూడ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మాల్దీవుల యాత్రకు పరిణీతి చోప్రా తన తల్లి, అత్తగారు, కోడలు సహా స్నేహితుల బృందంతో వెళ్లింది. అక్కడ బీచ్ లలో షికార్ చేస్తూ ఆ ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. మాల్దీవుల బీచ్ విహారంలో ఒక కొలను పక్కన విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోలను కూడా పారీ షేర్ చేసింది.
ఈ ఫోటోల్లో పారీ బీచ్ పరిసరాల్లో విహరిస్తూ ఆనందంగా కనిపించింది. వీటిలో తొలి ఫోటోలో చుట్టూ పచ్చదనం మధ్య సైకిల్ తొక్కుతూ నవ్వులు చిందిస్తూ కనిపించింది. నియాన్ గ్రీన్ షర్ట్ -యు డెనిమ్ షార్ట్ కింద గ్రే క్రాప్డ్ టాప్ ధరించింది. బూట్లు.. ముదురు రంగు సన్ గ్లాసెస్ కూడా ధరించింది. తదుపరి ఫోటోలో తన తల్లి, అత్తగారు, కోడలు ఇతరులతో కలిసి బీచ్‌లో నడిచింది. మూడవ ఫోటోలో పారీ ఒక కొలను పక్కన విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. తన కాళ్ల ఫోటోలను మాత్రమే ప్రదర్శించింది. చివరి ఫోటోలో పరిణీతి నల్లటి దుస్తులు - మ్యాచింగ్ బూట్స్ ధరించి నీటి పక్కన పోజులిచ్చింది. ఆమె ఒక డెక్ మీద నిలబడి కెమెరా నుండి దూరంగా చూస్తూ కనిపించింది.
పారీ ఈ పోస్ట్‌కి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చింది, అమ్మ అత్తగారితో అమ్మాయిలు యాత్రకు వెళ్లినప్పుడు చక్కని త్రోబాక్ ఫోటో! అంటూ ఫన్నీ క్యాప్షన్ ని జోడించింది. వాల్డోర్ఫ్ ఆస్టోరియాకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఘన స్వాగతం.. గొప్ప ఆతిథ్యం ఇవ్వడం! మేం ఇక తిరిగి రాలేం! అని వ్యాఖ్యను జోడించింది. గర్ల్స్ ట్రిప్, హాలిడేస్ ప్లాన్ చేయండి .. మర్చిపోలేని విధంగా జీవించండి... అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా జోడించింది.
గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిణీతి - రాఘవ్ చద్దాతో కలిసి ఉన్న వెకేషన్ త్రోబాక్ ఫోటోలను షేర్ చేసింది. గత నెల పరిణీతి తన గాళ్స్ గ్యాంగ్ తో పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇది హనీమూన్ కాదు! కోడలు #గర్ల్స్ట్రిప్ లో తీసిన ఫోటో అని తెలిపింది. బ్లాక్ కలర్ స్విమ్సూట్ను ధరించి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది పారీ. ఆమె తన పింక్ చూడా (బ్యాంగిల్స్)ను కూడా ప్రదర్శించింది. రాఘవ్ చద్దాతో తన హనీమూన్ కాదని, ఆమె ఒక కప్పు కాఫీ పట్టుకున్న ఫోటోని మాత్రమే ప్రదర్శించి పూర్తిగా క్లారిటీ ఇచ్చేసింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 'చమ్కిలా'లో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి పరిణీతి కనిపించనుంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథాంశం ఆసక్తికరం. ఇద్దరు ప్రసిద్ధ పంజాబీ గాయకులు అమర్‌జోత్ కౌర్.. అమర్ సింగ్ చమ్కిలా చుట్టూ తిరిగే కథాంశమిది.