పరిణితికి ఇక ఆ ఛాన్స్ లేదంటున్నారా?
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే నియమాన్ని రాఘవ్ చద్దా ప్రేమ విషయం చెప్పగానే విధించినట్లు
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వృత్తిపరంగా ఇద్దరి ప్రయాణాలు భిన్నమైనవి. ఒకరు నటి కాగా..మరొకరు రాజకీయ నాయకుడు. ఈ కాంబినేషన్ లో ప్రేమ..పెళ్లి అన్నదే ఊహించనిది. కానీ పరిణితి-రాఘవ్ చద్దా దాన్ని సాధ్యం చేసారు. వివాహ బంధంతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిణితి ఇకపై నటిగా కొనసాగుతుందా? లేదా? అని కొన్ని నెలలుగా నెట్టింట వాడి వేడి చర్చ సాగుతుంది.
ఇప్పటికే కొన్ని గెస్సింగ్స్ తెరపైకి వచ్చాయి. వివాహమనంతరం కుటుంబ జీవితానికే పరిణితి అంకితమవుతుందని ప్రచారం సాగుతోంది. తాజాగా ఉదయ్ పూర్ వివాహ వేడుక వద్ద ఈ అంశంపై కుటుంబ సభ్యుల్లో చర్చ సాగినట్లు సమాచారం.
రాఘవ్ చద్దా కుటుంబీకులు పరిణితితో పరిణయాన్ని కొన్ని కండీషన్ల ప్రకారమే అంగీకరించినట్లు వినిపిస్తోంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలనే నియమాన్ని రాఘవ్ చద్దా ప్రేమ విషయం చెప్పగానే విధించినట్లు ..అందుకు అంగీకారమైతేనే పెళ్లి అని..లేకుంలే లేదు అన్న తమ నిర్ణయాన్నికరాఖండీగా కుటుంబీకులు చెప్పినట్లు సమాచారం.
ఈ విషయంలో పరిణితి కూడా అత్తింటి కుటుంబ నిర్ణయాన్ని గౌరవించి అంగీకరించినట్లు వినిపిస్తుంది. అయితే ఇక్కడే పరిణితి అదే కుటుంబానికి తనవైపు కండీషన్ కూడా వినిపించిందిట. కమిట్ అయిన ప్రాజెక్టులు వరకూ పూర్తి చేస్తానని...అంతవరకూ తన నిర్ణయాన్ని కుటుంబీకులు గౌరవించి ఒప్పుకోవాలని కోరిందిట. అందుకు రాఘవ్ చద్దా కుటుంబీకులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.
పరిణితి చోప్రా చేతిలో అధికారికంగా ఉన్నవి రెండు సినిమాలే. ' మిషన్ రాణిగంజ్' ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసింది. అలాగే 'అమర్ సింగ్ చంకీలా' కూడా చిత్రీకరణ పూర్తిచేసింది. వాటికి డబ్బింగ్...రిలీజ్ సమయంలో వాటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందిట.
అలాగే మరో నాలుగు సినిమాలకు కూడా అగ్రిమెంట్ చేసుకుందని అనధికారిక సమాచారం. అవి లాక్ అయితే! వాటిని కూడా పరిణితి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాఘవ్ చద్దా కండీషన్లు అప్లై అవుతాయి.