సలార్ పై పరుచూరి వెరైటీ రివ్యూ..!

నేటితరం హీరోల్లో అందరికన్నా ముందు నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా అతనికి ఒక వరం

Update: 2023-12-27 07:36 GMT

కె.జి.ఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ సలార్ 1 సీజ్ ఫైర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న సలార్ సినిమాపై సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూ ఇచ్చారు. పరుచూరి పలుకులు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన రిలీజైన సినిమాలపై తన కామెంట్ వినిపిస్తున్నారు.

ప్రతి సినిమాకు రిలీజ్ అయిన చాలా రోజుల తర్వాత దాదాపు ఆ సినిమాల ఓటీటీ రిలీజ్ తర్వాత రివ్యూ ఇచ్చే పరుచూరి గోపాలకృష్ణ సలార్ సినిమాకు వారం రోజుల్లోనే రివ్యూ ఇచ్చేశారు. వర్షం, పౌర్ణమి సినిమాల టైం నుంచి ప్రభాస్ ను చూస్తున్నానని.. మంచి తనానికి మారుపేరు ప్రభాస్.. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటడం అతనిలో గొప్ప విషయమని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

నేటితరం హీరోల్లో అందరికన్నా ముందు నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి సినిమా అతనికి ఒక వరం. ఆ సినిమాతోనే ప్రభాస్ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడని అన్నారు. ఇప్పుడు సలార్ తో మరో విజయాన్ని అందుకున్నాడు. కె.జి.ఎఫ్ లాంటి సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ సలార్ తెరకెక్కించారు. జానపద కథను యాక్షన్ సినిమాగా ప్రశాంత్ నీల్ రూపొందించిన విధానం బాగుంది. అయితే దీనికి బాహుబలి స్పూర్తిగా ఉండొచ్చని అన్నారు. ఈ సినిమాలో పాత్రలన్నీ అద్భుతాలే అని అన్నారు పరుచూరి గోపాలకృష్ణ.

ఇదే క్రమంలో తాను పరిశ్రమకు వచ్చిన కొత్తలో విషయాలను ప్రస్తావించారు. ఆ టైంలో ఒక్కో హీరో ఏడాదికి 20 సినిమాలు చేసేవారు. వాటిలో కొన్ని ప్రేక్షకాదరణ పొందకపోయినా వాటి ప్రభావం కనిపించేది కాదు. కానీ ఇప్పుడు హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు. అది హిట్ కాలేకపోతే ఫ్యాన్స్ మళ్లీ 3 ఏళ్లు ఎదురుచూడాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది. వాళ్లు కోరే విధంగా సినిమా తీయాలని ఇప్పటి దర్శకులు ఆలోచిస్తున్నారని అన్నారు. ప్రేక్షకుల ఆలోచనలకు తగినట్టు తీసే దర్శకులలో రాజమౌళి ముందు వరుసలో ఉన్నారు. హీరోల లిస్ట్ లో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారని అభినందనలు తెలిపారు పరుచూరి.

Tags:    

Similar News