ఆ ఇద్ద‌రు రెండు కళ్లు అయితే మెగాస్టార్ మూడో కన్ను!

తాజాగా ఈ అంశంపై `పరుచూరి పలుకులు` ద్వారా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

Update: 2024-02-08 02:30 GMT

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం భార‌త‌దేశ రెండ‌వ అత్యున్న‌త పౌర పుర‌స్కారం ప‌ద్మ‌విభూష‌ణ్ మెగాస్టార్ చిరంజీవికి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మెగాస్టార్ ఇంట ప‌లు ప‌ద్మాలు విర‌సిల్లిన నేప‌థ్యంలో ప‌ద్మ‌విభూష‌ణ్ కూడా వ‌రించ‌డంతో ప్ర‌ముఖులంతా సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ తెలియ‌జేయ‌డం జ‌రిగింది. తాజాగా ఈ అంశంపై 'పరుచూరి పలుకులు' ద్వారా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... 'మొన్న జరిగిన పద్మ అవార్డు ఫంక్షన్ కి రమ్మని చిరంజీవిగారు కాల్ చేస్తే వెళ్లాను. ఒక అత్యున్నతమైన పురస్కారం లభించిన తరువాత వేసే అడుగులు మరింత జాగ్రత్తగా .. ఆదర్శవంతంగా ఉండాలనే ఆయన మాటలు నాకు బాగా నచ్చాయి. ఆయన చేసిన సేవా కార్యక్రమాలను గురించి చిరంజీవి కొన్ని మాత్రమే చెప్పారు. నిజానికి ఆయన ఎన్నో సేవలు చేశారు.

ఎవరి సపోర్టు లేకుండా ఆయన ఈ స్థాయిని అందుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఒక్క చిరంజీవిగారు మాత్రమే కాదు .. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ ... శోభన్ బాబు .. వీళ్లంతా ఆ రోజుల్లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చరిత్ర సృష్టించిన వారే. తెలుగు ఇండస్ట్రీకి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండు కళ్లు అయితే.. నుదుటున మూడో కన్ను చిరంజీవి అని నేను చాలాకాలం క్రితమే చెప్పాను.

అదే మాటను మ‌ళ్లీ మొన్న‌టి వేదికపై వెంకయ్య నాయుడు గారు అనడం నన్ను ఆనందాశ్చర్యాలకు గురిచేసింది. చిరంజీవి తన కెరియర్ ఆరంభంలో నెగెటివ్ రోల్స్ ను సైతం పోషించారు. ఆ తరువాత చేసిన 'ఖైదీ' ఆయన జీవితాన్ని మార్చేసింది. ఒక సినిమా చరిత్ర సృష్టించడం వేరు .. ఆ సినిమా చేసిన ఆర్టిస్టు జీవితాన్ని మార్చేయడం వేరు. అలాంటి సినిమాకి పనిచేయడం మా అదృష్టంగా మేము భావిస్తూ ఉంటాము' అని అన్నారు.


Tags:    

Similar News