రిమాండ్ ఖైదీ కి జైల్లో గొంతెమ్మ కోర్కెలా?
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రా గౌడ్ పరప్పన అగ్రహారం కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రా గౌడ్ పరప్పన అగ్రహారం కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధించడంతో ఆమెని అక్కడిని తరలించారు. అయితే జైలుకెళ్లిన నాటి నుంచి పవిత్ర సరిగ్గా తినడం లేదని, నిద్రపోవడం లేదని వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా కూర్చుని రోధిస్తుం దని వార్తలొస్తున్నాయి. తాజాగా పవిత్ర జైలులో మహిళా సిబ్బందితో వాగ్వివివాదానికి దిగినట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దుప్పటి, వేడి నీళ్ల విషయంలో ఈ వివాదం చోటు చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. పవిత్రకు రాత్రిపూట కప్పుకునేందుకు ఒక దుప్పటి ,దిండు సిబ్బంది అందించారుట. కానీ అవి నచ్చకపోవడంతో ఇంటి నుంచి ఆ రెండు తెప్పించుకుంటానని, అలాగే బోజనం కూడా ఇంటి నుంచే తెప్పించుకునేలా అనుమతి ఇవ్వాలని అడిగిందిట. అలాగే వేడి నీళ్లు ఇవ్వడానికి అధికారులు అడ్డు చెప్పడంతో ఎందుకివ్వరని తిరిగి ప్రశ్నించిందిట.
సమాజంలో పేరున్న నాలాంటి వాళ్లకు ఇలాంటి సౌకర్యాలు ఎందుకు కల్పించరాని వాధించిందిట. దీంతో సిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ రూల్స్, పరిస్థితులు వివరించారుట. చివరిగా ఇది మీ ఇల్లు కాదని...ఇక్కడ గొంతెమ్మ కోరికలు నెరవేర్చడానికి వ్యక్తి గత అసిస్టెంట్లు ఎవరూ ఉండరని, ఖైదీలందరితో తాను సమానమే అన్నట్లు హెచ్చరించారుట. దీంతో పవిత్ర పరిస్థితుల్ని అర్దం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక అదే జైలులో ప్రత్యేక బ్యారక్ లో నటుడు దర్శన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇతర ఖైదీలతో కలిపితే ఇబ్బందులు ఏర్పడుతాయని ప్రత్యేక బ్యారక్ లో ఉంచారు. ఆయనతో పాటు కేసులో నిందుతులుగా ఉన్న మిగతా వారు కూడా అదే జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.