వీరమల్లు-2 పవన్ తో సాధ్యమేనా?
`హరిహర వీరమల్లు` సినిమా విషయంలో ఎలాంటి జాప్యం చోటు చేసుకుందో తెలిసిందే.
`హరిహర వీరమల్లు` సినిమా విషయంలో ఎలాంటి జాప్యం చోటు చేసుకుందో తెలిసిందే. షూటింగ్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కానీ ఇంతవరకూ షూటింగ్ పూర్తవ్వలేదు. అందుకు కారణాలు అనేకం అయినా? పవన్ కళ్యాణ్ సవ్యంగా కేటాయించకపోవడం వల్లే షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అవ్వలేదు అన్నది వాస్తవం. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించిన తర్వాత పవన్ `ఓజీ` సినిమా ని ప్రకటించడం..ఆ తర్వాత ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవ్వడం..అనంతరం `ఉస్తాద్ భగత్ సింగ్` తెరపైకి రావడం...దాన్ని పట్టాలెక్కించడం ఇలా పెద్ద కథే నడిచింది.
మధ్యలో కరోనా కూడా అడ్డంకిగా మారింది. ఇంకా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం....అపై ఎన్నికల హడావుడి ఇలా అన్ని కలిసి వీరమల్లు షూటింగ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఇంకా పవన్ పై 20 రోజులు షూటింగ్ పెండింగ్ ఉంది. అందుకోసం ఈనెల 23 నుంచి డేట్లు ఇచ్చారు. నాటి నుంచి 20 రోజులు కంటున్యూగా వీరమల్లు సెట్స్ కి వెళ్తారు. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు.
అయితే `హరిహర వీరమల్లు` పార్ట్ -2 కూడా ఉందని మేకర్స్ ప్రకటించారు. కానీ పవన్ బిజీ షెడ్యూల్ లో పార్ట్ -2ని పూర్తి చేయడం అన్నది జరిగే పనేనా? అన్నది అతి పెద్ద ప్రశ్న. మొదటి భాగం పూర్తి చేయడా నికే సంవత్సరాలు పడుతుంది. ఇక రెండో భాగం అంటే అంతకుమించి శ్రమించాల్సి ఉంటుంది. తొలి భాగం సమయంలో పవన్ సినిమా కోసం ప్రత్యేకంగా కత్తియుద్దంలో తర్పీదు తీసుకున్నారు. నిపుణుల ఆధ్వర్యంలో అవసరమైన ట్రైనింగ్ తీసుకున్నారు.
ఇక రెండవ భాగం అంటే? మరింత ప్రతష్టాత్మకంగా ముగించాల్సి ఉంటుంది. మొదటి భాగాన్ని మించి ఎక్కువ గా శ్రమించాలి. అన్నింటిని మించి ఎక్కువగా డేట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి పనిచేయాలి. ఏదో కమర్శియల్ సినిమాలా ముగించి వెళ్లిపోదామంటే కుదిరే పని కాదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలి. అలాగే ఏపీ డీసీఎం బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది.
కాలక్రమంలో రాజకీయంగా పీకే మరింత బిజీ అవుతారు. అప్పుడసలు పవన్ సినిమాలు చేసే పరిస్థితే ఉండదు. మరి ఇలాంటి తరుణంలో వీరమల్లు -2 అంటే? పవన్ డేట్లు ఎలా సర్దుబాటు చేస్తారు? అన్నది చూడాలి.