వీరమల్లుకి పోటీగా ఆ ఇద్దరు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జోనర్ లో చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ చివరి దశలో ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీరియాడిక్ జోనర్ లో చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ చివరి దశలో ఉంది. క్రిష్ దర్శకత్వంలో మొదలైన ఈ మూవీ షూటింగ్ మూడేళ్ళ క్రితం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యాచరణ కారణంగా ఈ మూవీ చాలా సార్లు వాయిదా పడింది. దీని తర్వాత స్టార్ట్ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయిపోయాయి. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పూర్తి చేసే పనిలో ప్రస్తుతం పవన్ ఉన్నారు.
జ్యోతికృష్ణ ఈ పెండింగ్ షూట్ మొత్తం ఫినిష్ చేస్తారంట. పోస్ట్ ప్రొడక్షన్ దశలో క్రిష్ ఈ సినిమా కోసం మళ్ళీ వస్తారని తెలుస్తోంది. 2025 మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీకి 200 కోట్ల బడ్జెట్ దాటిపోయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘VD 12’ మూవీ కూడా మర్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కన్ఫర్మ్ చేయడంతో ‘VD 12’ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కి సోలో రిలీజ్ డేట్ దొరికే అవకాశం లేదని టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం అదే టైంలో ఇతర భాషలలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉండటం. మలయాళీ నుంచి మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లూసిఫర్’ సీక్వెల్ ‘L2: ఎంపురన్’ మార్చి 27న రిలీజ్ కాబోతోంది.
దీంతో పాటుగా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సికందర్’ కూడా మార్చి 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. కచ్చితంగా ఈ చిత్రాలతో ‘హరిహర వీరమల్లు’ కి గట్టి పోటీ ఎదురుకావడం గ్యారెంటీ అనుకుంటున్నారు.
హిందీలో సల్మాన్ ఖాన్ తో పోటీ పడటం అంటే పెద్ద రిస్క్ అని చెప్పొచ్చు. అలాగే మలయాళంలో మోహన్ లాల్ ‘L2’ పైన ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ‘హరిహర వీరమల్లు’ కి పోటీగా రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా కలెక్షన్స్ పై వాటి ఇంపాక్ట్ ఉంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ కి నేషనల్ వైడ్ గా ఇమేజ్ వచ్చింది. ఇది ‘హరిహర వీరమల్లు’ కి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.