వ‌ర‌ద ముంపు.. ప‌వ‌న్-మ‌హేష్ భారీ విరాళాలు

ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి.

Update: 2024-09-03 15:53 GMT

ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెల‌బ్రిటీలు విరాళాల్ని ప్ర‌క‌టిస్తున్నారు. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నిధికి రూ.50 లక్షలు., తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఏపీ- తెలంగాణ‌ల‌కు ఎన్టీఆర్ చెరో 50ల‌క్ష‌లు, వైజ‌యంతి అధినేత అశ్వ‌నిద‌త్ ఏపీ స‌హాయ‌నిధికి 25ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. అలాగే యువ‌న‌టి అన‌న్య నాగ‌ళ్ల త‌న‌వంతు సాయంగా ఇరు తెలుగు రాష్ట్రాల‌కు చెరో 2.5 ల‌క్ష‌లు (మొత్తం 5ల‌క్ష‌లు) సాయంగా ప్ర‌క‌టించి స్ఫూర్తిగా నిలిచారు.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్యమంత్రి, ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర‌ విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితి పరిశీలించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి శ్రీమతి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా ఇతర ఉన్నతాధికారులతో క‌లిసి ప‌వ‌న్ సమీక్ష నిర్వహించారు.

ఇదే స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎం నిధికి కోటి విరాళం ప్ర‌క‌టించారు.

రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా, నేను AP - తెలంగాణ ల‌ సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఒక్కొక్కరికి 50 లక్షల విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి మరింత బలంగా ఎదగాలి.. అని మ‌హేష్ అన్నారు. ప‌వ‌న్, మ‌హేష్‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ కూడా కోటి విరాళాలు ప్ర‌క‌టించిన వారిలో ఉన్నారు.

Tags:    

Similar News