PSPK బర్త్ డేకి అదిరిపోయే 'ఓజీ' ట్రీట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడి యంగ్ ట్యాలెండెడ్ సుజిత్ 'ఓజీ' తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడి యంగ్ ట్యాలెండెడ్ సుజిత్ 'ఓజీ' తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. 'పంజా' తర్వాత పీకే మరోసారి గ్యాంగ్ స్టర్ గా కనిపించడంతో అంచనాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. నెక్స్ట్ అప్ డేట్ ఎలా ఉంటుందంటూ ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ టీమ్ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'ఓజీ 'నుంచి ఓ సాలిడ్ గ్లింప్స్ రెడీ చేస్తున్నట్లు వినిపిస్తోంది. పీకే ఇప్పటికే రాజకీయ సమావేశాల్లో భాగంగా జనాల్లో తిరుగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ లో పొలిటికల్ కాక పీక్స్ లో ఉన్న నేపథ్యంలో పీకే ప్రసంగాలు అంతకంతకు మార్కెట్ లో వేడెక్కుతున్నాయి. ఇదే సమయంలో ఓజీ నుంచి కూడా పవర్ ఫుల్ గ్లింప్స్ ఒకటి వదిలే ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
ఈనేపథ్యంలో ఓజీ టీమ్ ఇలా ప్లాన్స్ చేస్తున్నట్లు గుస గుస వినిపిస్తుంది. ఈ గ్లింప్స్ కి నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడని అంటున్నారు. ఇతడి వాయిస్ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. విక్రమ్ లో రోలెక్స్ పిలుపుతో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యాడు. అతడి వాయిస్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో క్రేజీ వాయిస్ గానూ మారింది. ఈ నేపథ్యంలో అర్జున్ దాస్ గాత్రాన్ని వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఇందులో నిజమెంత అన్నది మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. సెప్టెంబర్ 5వ తేది నుంచి ఓజీ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. గురుపూజోత్సవం పురస్కరించుకుని పీకే సెట్స్ కి వెళ్తాడు. అప్పటి నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుగుతోంది. కొన్ని రోజులుగా వారాహి యాత్రలో బిజీగా ఉండటంతో ఓజీ షూటింగ్ కి బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే.