పవన్ కళ్యాణ్.. నిర్మాతలకు ఇది టెన్షనే..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నారు
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో యాక్టివ్ గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు పవన్ కళ్యాణ్ మరో ఐదు మంత్రిత్వ శాఖలు కూడా తీసుకున్నారు. ఈ శాఖలన్నింటికి సంబందించిన పనులని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దగ్గరుండి చూసుకోవాలి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన పోర్ట్ ఫోలియోలు అని చెప్పాలి. పంచాయితీరాజ్, రూరల్ డెవలప్మెంట్ శాఖలు పవన్ కళ్యాణ్ ఏరికోరి తీసుకున్నారు. వాటి నిర్వహణ అనేది చాలా క్లిష్టతరమైనది అని చెప్పాలి.
అలాంటి శాఖలని పవన్ కళ్యాణ్ తీసుకోవడం వెనుక రూరల్ డెవలప్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సారించడానికేననే మాట వినిపిస్తోంది. కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ శాఖలని సమర్ధవంతంగా నిర్వహిస్తారని చాలా మంది నమ్ముతున్నారు. అయితే ఇన్ని బాధ్యతల మధ్యలో పవన్ కళ్యాణ్ కి ఊపిరి తీసుకోలేనంత వర్క్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మూడు సినిమాలు ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంది.
ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా 30% కంప్లీట్ అయ్యిందంట. ఇవి సకాలంలో పూర్తిచేయకపోతే నిర్మాతలు భారీగా నష్టపోతారు. పవన్ గెలుపు ఇప్పుడు నిర్మాతలని టెన్షన్ పెడుతుందనే మాట వినిపిస్తోంది. ఇక లుక్స్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ లో డేట్స్ అడగాలంటే కూడా నిర్మాతలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని దర్శక, నిర్మాతలు అనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలకి ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఈ చిత్రాల తర్వాత కొత్త సినిమాలు ఐదేళ్ల వరకు పవన్ కళ్యాణ్ చేయకపోవచ్చనే మాట కూడా వినిపిస్తోంది. అసలు సినిమాల్లో ఉండకపోవచ్చు అనేలా కూడా అనిపిస్తుంది. పవన్ స్పీడ్ చూస్తుంటే పాలిటిక్స్ లోనే ఫ్యాన్స్ కు రియల్ ఎలివేషన్స్ ఇచ్చేలా ఉన్నాడు. ఇక OG సినిమాను మొదట ఫినిష్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ లో లేదా వచ్చే ఏడాది రిలీజ్ కావచ్చు.