పవన్ కళ్యాణ్.. ఈ లెక్కతో మొత్తం 7 సినిమాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో టాక్ ఆఫ్ ది టౌన్ లో ఉన్నారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో టాక్ ఆఫ్ ది టౌన్ లో ఉన్నారు. ఆయన మీటింగ్ పెట్టి ఒక ప్రసంగం చేస్తే ఆ వైబ్, విమర్శలు, ప్రతి విమర్శలతో కనీసం వారం రోజుల పాటు నడుస్తూ ఉంటుంది. రానున్న ఎన్నికలలో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు.
అయితే రాజకీయాల కారణంగా పవన్ కళ్యాణ్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఎన్నికల తర్వాత మరల మొదలు పెట్టనున్నాడు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ రెండు భాగాలుగా సిద్ధం అవుతోంది. వీటిలో మొదటి పార్ట్ షూటింగ్ చివరి దశకి వచ్చేసింది. ఓ రెండు వారాలు పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే మూవీ కంప్లీట్ అయిపోతుందని తెలుస్తోంది.
దీని తర్వాత నానితో సినిమాని సుజిత్ ఫినిష్ చేసి ఓజీ పార్ట్ 2పై ఫోకస్ చేస్తారు. క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమా కూడా రెండు భాగాలుగానే తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపొయింది. హిస్టోరికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో లేట్ షూట్ అవుతోంది.
హరిహర వీరమల్లు పార్ట్ 2 కూడా చర్చల దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగింది. ఓజీ తర్వాత ఇది ఫినిష్ చేసే అవకాశం ఉంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ మూవీ ఇంకా స్క్రిప్ట్ వర్క్ దశలోనే ఉంది. ఇవి కాకుండా మరో సినిమా కూడా పవన్ తో ఓ బడా నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.
ఇలా ఏకంగా ఏడు చిత్రాలు పవన్ ఖాతాలో ఉన్నాయి. ఇవన్ని 2025 ఆఖరికి లేదా 2026 నాటికి కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఆ తరువాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయనున్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలలో సింగిల్ గా అధికారంలోకి వచ్చే దిశగా పవన్ కళ్యాణ్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఆయన సన్నిహిత వర్గాలలో వినిపిస్తోన్న మాట.