పవర్ఫుల్ OG డేట్ ఫిక్స్.. గెట్ రెడీ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న OG సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. RRR లాంటి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను తెరపైకి తీసుకువచ్చిన ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరొకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా దర్శకుడు సుజిత్ అతనితో అవసరం లేని సన్నివేశాలను చకచకా పూర్తి చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉన్నప్పుడే అతనికి సంబంధించిన సీన్స్ ను షూట్ చేస్తున్నారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే.. అనే డైలాగ్ మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.
ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా యువ దర్శకుడు పక్క ప్రణాళికతో ఈ సినిమాను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరొకవైపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక సినిమాకు సంబంధించిన విడుదల డేట్ పై చాలా రోజులుగా అనేక రకాల గాసిప్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
మొత్తానికి ఇటీవల చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా ఒక అఫీషియల్ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ ఆ పోస్టర్లో చాలా స్టైలిష్ లుక్కుతో కనిపిస్తూ ఉన్నాడు. ఖుషి లాంటి స్మార్ట్ లుక్స్ తో పాటు మరొకవైపు పంజా లాంటి హై వోల్టేజ్ వైబ్ తో పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా వివరణ ఇచ్చేశారు.
తప్పకుండా సినిమాను అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే ఆలోచనలతో ఉన్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరొక సాంగ్ కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ ఓపెనింగ్స్ అందుకుంటాయని ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.