పవర్ స్టార్ వచ్చే ఏడాది 3.. సాధ్యమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ మరో వైపు జనసేన పార్టీతో ఏపీలో బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2023-08-13 04:49 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ మరో వైపు జనసేన పార్టీతో ఏపీలో బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా రెండు పడవల ప్రయాణం కారణంగా సినిమాలకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు అనేవారు ఉన్నారు. రాజకీయంగా బలపడే ప్రయత్నం చేస్తుండటంతో కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని సకాలంలో పూర్తి కావడం లేదు. ప్రస్తుతం అతని చేతిలో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది.

హరిహర వీరమల్లు మూవీ రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. ఇప్పటికి ఓ 30 రోజుల షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందంట. ఎన్నికలు అయ్యేంత వరకు మరల ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ లేనట్లు కనిపిస్తోంది. సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీస్ మాత్రం పూర్తి చేయాలని అనుకుంటున్నారు. రెండు కూడా కమర్షియల్ యాక్షన్ మూవీస్ కావడం వలన వేగంగా కంప్లీట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.

సుజిత్ ఓజీ మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఒక పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఓజీ మూవీ రానున్నట్లు తెలుస్తోంది. దీనికంటే ముందుగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ చేయాలని హరీష్ శంకర్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే ఈ లోపు షూటింగ్ అనుకున్నట్లు పూర్తయితేనే సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు సినిమా అయితే వచ్చే ఏడాది ఏప్రిల్ లోపు కంప్లీట్ అవుతుందని నిర్మాత ఏఎం రత్నం అంటున్నారు. ఒక వేళ అలా కంప్లీట్ చేయగలిగితే 2024 రెండో అర్ధ సంవత్సరంలో మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎలా చూసుకున్న వచ్చే ఏడాది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఏకంగా మూడు సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి.

ఓ విధంగా ఇది ఫ్యాన్స్ కి పండగలాంటి వార్త అని చెప్పొచ్చు. రానున్న ఎన్నికలలో పవర్ స్టార్ గతంలో మాదిరిగా కాకుండా ఆశించిన స్థాయిలో పాజిటివ్ రిజల్ట్ సాధిస్తే అది సినిమాల ప్రమోషన్ కి కూడా మరింత ప్లస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. మరి వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ కెరియర్ కి ఎలాంటి పాజిటివ్ వైబ్ ఉంటుందనేది చూడాలి.

Tags:    

Similar News