పవన్.. ఇక వాళ్ళకు పండగే..
హోల్డ్ లో అన్ని సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మూవీలకు పవన్ అందుకొనే రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్.. మెగా కాంపౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అదిరిపోయే యాక్టింగ్, మేనరిజంతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. తన దాతృత్వంతో ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చినా.. అనేక మందికి ఇష్టమైన నటుడిగా మారారు. అనేక బ్లాక్ బస్టర్ సినిమాలతో అన్ని వర్గాల్లో ఆడియన్స్ ను మెప్పించారు.
టాలీవుడ్ లోని మిగిలిన హీరోలతో పోలిస్తే పవన్ రూటే వేరు. అందుకే తెలుగు చిత్రసీమలో పవర్ స్టార్ కు ఉన్న అభిమానులు మరో హీరోకి లేరని చాలా మంది చెబుతుంటారు. ఇప్పుడు సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అనిపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడడం నుంచి విజయం సాధించడం వరకు కీలక పాత్ర పోషించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
పదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. గత ఐదేళ్లుగా ప్రజలతో మమేకమయ్యారు. పిఠాపురంలో భారీ మెజార్టీతో విజయం సాధించారు. జనసేన అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులకు అండగా నిలిచారు. పవన్ కాదు.. తుఫాన్ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారంటే.. పవర్ స్టార్ కు ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రెండు మూడు రోజులుగా.. ఎక్కడ చూసినా గేమ్ ఛేంజర్ పవన్ కోసమే చర్చ నడుస్తోంది.
అయితే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే కొద్ది రోజుల ముందు నుంచే.. పవన్ తన సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల సమరంలోకి దిగారు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయాయి. మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరబోతోంది. పవన్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని టాక్ నడుస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ కోసం చర్చ మొదలైంది..
సాధారణంగా పవన్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన చిత్రాలను అభిమానులు ఆదరిస్తుంటారు. ఇప్పుడు ఆయన క్రేజ్ పది రెట్లు పెరిగింది. దీంతో కొత్త చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ అవుతుంది. హోల్డ్ లో అన్ని సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మూవీలకు పవన్ అందుకొనే రెమ్యునరేషన్ కూడా పెరుగుతుందని అంటున్నారు.
అయితే పవన్ చేతిలో ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర మల్లు చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఓజీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కానీ ఇంకా షూటింగ్ పార్ట్ కాస్త ఎక్కువే పెండింగ్ ఉంది. హరిహర వీరమల్లు డిసెంబర్ లో విడుదల అవ్వనుందని అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని టాక్. మరి పవన్ కొత్త చిత్రాలు.. నిర్మాతలకు ఎలాంటి లాభాలు కురిపిస్తాయో చూడాలి.