అయ్యో.. ఉస్తాద్ మళ్ళీ ఆగిందే..
ఇటీవల మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగిపోయిన తన సినిమాలను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇటీవల మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆగిపోయిన తన సినిమాలను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక హరీష్ శంకర్ కూడా వీలైనంత త్వరగా తన సినిమా షూటింగ్‌ను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే కొన్ని మేజర్ సీన్స్ ను ఫినిష్ చేసుకుంది. అయితే ఈసారి అసలైన యాక్షన్ ఎపిసోడ్ ను ఫినిష్ చేయాలి అని దర్శకుడు మొత్తం ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడు.
అయితే ఇప్పుడు ఆ కీలకమైన షెడ్యూల్ వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఒప్పించి ఉస్తాద్ లేటెస్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ తో చాలాసార్లు చర్చలు జరిపి మరి ఒప్పించాడు. అయితే నిన్నటి వరకు కూడా చిత్ర యూనిట్ సభ్యులు చాలా హడావిడిగా ప్రణాళికలతో కనిపించారు.
సోషల్ మీడియాలో కూడా దర్శకుడు హరీష్ శంకర్ ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. అందులో కత్తులు కొడవళ్లు గొడ్డళ్ళు చూపించాడు. వీటితోనే మంగళవారం షూటింగ్ జరగబోతోంది అని చెప్పాడు. ఇక ఫ్యాన్స్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయిన తరుణంలోనే మరొక బ్యాడ్ న్యూస్ అయితే వినిపించింది. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.
ఎందుకంటే గత రెండు మూడు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్న కారణంగా ఇప్పుడు మంగళవారం నుంచి మొదలు కావాల్సిన షూటింగ్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. అందరి డేట్స్ ఫిక్స్ చేసుకొని మరి ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వర్షం కారణంగా షూటింగ్ నిలిపివేయాల్సి వచ్చింది.
ఇక మళ్ళీ మరొక ప్లాన్ సెట్ చేసుకోవడం అంటే చాలా కష్టమైన పని. వీలైనంతవరకు ఈ వీకెండ్ లోనే కీలకమైన సన్నివేశాలను పవన్ కళ్యాణ్ తో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. మరి వాతావరణం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా మరో రెండు మూడు నెలల్లోనే ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు.