దీక్షలో కూడా పవన్ 'పదకొండు'!

ఇప్పటికే వైసీపీకి 11 సీట్లు రావడంపై సోషల్ మీడియాలో మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష 11 రోజులు చేయడం వెనుక వైసీపీ సీట్లు గుర్తుచేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Update: 2024-06-25 03:52 GMT

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన అధికారిక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. వరుసగా తాను నిర్వహిస్తున్న సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తునన్నారు. అలాగే కీలక విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటితో పాటు సినీ నిర్మాతలతో తాజాగా సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. అలాగే వైద్య, ఆరోగ్య శాఖపైన కూడా సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చాలా పరిపాలన బాధ్యతలలో పవన్ కళ్యాణ్ ని భాగస్వామ్యం చేశారు. అందుకే పవన్ కళ్యాణ్ తన శాఖలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిగా ఉద్యోగ నిర్వహణలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకి ముందు రాజకీయ క్షేత్రంలో సభల కోసం వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వారాహి అమ్మవారి పేరు మీదుగా ఆ యాత్రని మొదలు పెట్టారు.

ఎన్నికలలో గెలవడంతో వారాహి అమ్మవారి మొక్కు చెల్లించుకోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. 11 రోజుల వారాహి దీక్ష చేయబోతున్నారు. ఈ నెల 26 నుంచి ఈ దీక్షని కొనసాగిస్తారు. ఈ దీక్షలో ఉన్నన్ని రోజులు కేవలం ఫలహారాలు మాత్రమే పవన్ కళ్యాణ్ ఆహారంగా తీసుకుంటారంట. అయితే పవన్ కళ్యాణ్ 11 రోజులు వారాహి దీక్షని వైసీపీ 11 సీట్లతో ముడిపెడుతున్నారు.

ఇప్పటికే వైసీపీకి 11 సీట్లు రావడంపై సోషల్ మీడియాలో మీమర్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష 11 రోజులు చేయడం వెనుక వైసీపీ సీట్లు గుర్తుచేయడమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. అయితే పవన్ మాత్రం ఇది కావాలని ఏమి చేయడం లేదు. ధీక్షలో భాగంగానే 11 రోజుల నెంబర్ ఫిక్స్ అయ్యింది

ఇప్పుడు వారాహి యాత్ర విజయవంతం అయ్యి అధికారంలోకి రావడంతో వారాహి దీక్షకి సిద్ధమవుతున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఐడియాలజీ, వ్యక్తిత్వం గురించి అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్ లు చేస్తూ గొప్పగా చెప్పుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు.త్వరలో ఇండస్ట్రీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా సన్మానించనున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు.

మరో వైపు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలని మెల్లగా పూర్తి చేయడంపై ఫోకస్ చేస్తున్నారు. వారంలో 2 రోజులు సినిమాలకి కేటాయించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చేస్తోన్న సినిమాల కోసం ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాదిలో హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ముందుగా కంప్లీట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. తరువాత సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీని పవన్ కళ్యాణ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లొచ్చు.

Tags:    

Similar News