కూటమి గెలిస్తే… పవన్ హోదాపై ఫ్యాన్స్ రియాక్షన్

కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ మంత్రి వర్గ విస్తరణలో ఏ శాఖ బాధ్యతలు తీసుకుంటారు అనే చర్చ నడుస్తోంది.

Update: 2024-05-18 07:30 GMT

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఈ సారి ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తుందని అందులో ఉన్న పార్టీల నాయకులు బలంగా నమ్ముతున్నారు. అదే సమయంలో మళ్ళీ అధికారం తమదే అని వైసీపీ నాయకులు విశ్వసిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కూడా ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. పవన్ ఫ్యాన్స్ అందరూ ఈ సారి జనసేన ప్రభావం బలంగా ఉండబోతోందని నమ్ముతున్నారు.

కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ మంత్రి వర్గ విస్తరణలో ఏ శాఖ బాధ్యతలు తీసుకుంటారు అనే చర్చ నడుస్తోంది. కొంతమంది ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉంటాడని అంటున్నారు. హోం మంత్రి పదవి అయితే పవన్ కళ్యాణ్ కి కరెక్ట్ గా సెట్ అవుతుందని మరికొంత మంది ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. హోం మంత్రి హోదాలో ఉంటే పోలీస్ వ్యవస్థని సక్రమంగా బాధ్యతలు నిర్వహించేలా పవన్ కళ్యాణ్ చేయగలడని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కనీసం రెండేళ్లయిన ముఖ్యమంత్రిగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇది జరగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచన లేనట్లు కనిపిస్తోంది. రాజకీయాల సంగతి ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో రెండు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ అల్ మోస్ట్ కంప్లీట్ అయిపొయింది. పవన్ కళ్యాణ్ కొన్ని రోజులు కాల్ షీట్స్ ఇస్తే మిగిలిన భాగం షూట్ చేసేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యి ఆగింది. హరిహర వీరమల్లు మూవీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది.

ఒక వేళ కూటమి అధికారంలోకి వస్తే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమాలపై ఫోకస్ పెట్టకపోవచ్చనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వంలో భాగం అవుతారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ పరంగా అన్ని విషయాలు తెలుసుకొని తరువాత ఈ ఏడాది ఆఖరులో వీలుబట్టి డేట్స్ కేటాయించే ఛాన్స్ ఉంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల భవితవ్యం ఆధారపడి ఉందనే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News