అంటే.. OG వచ్చేది అప్పుడేనా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో పీరియాడిక్ జోనర్ లో ఈ చిత్రాన్ని సుజిత్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో మూవీ ఉండబోతోందని ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ బట్టి తెలుస్తోంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఓజీ మూవీ షూటింగ్ కొంతకాలం వాయిదా పడింది. అసెంబ్లీ ఫలితాల తర్వాత వీలైనంత త్వరలో ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని సుజిత్ భావించారు. మూవీ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 27 అని అనుకున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ 25 రోజుల కాల్ షీట్స్ కేటాయిస్తే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుందంట.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందడంతో పాటు ఉపముఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వం బాధ్యతలలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించబోతున్నారు. రెండు, మూడు నెలల పాటు ఆయన పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలలో నిమగ్నమై ఉండే అవకాశం ఉందంట. అందుకే షూటింగ్ కి ఇప్పట్లో డేట్స్ కేటాయించే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తోంది.
హోల్డ్ లో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే డేట్స్ ఎప్పుడు కేటాయిస్తారనేది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఓజీ మూవీ అనుకున్న డేట్ కి రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాలలో టామ్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది జనవరి లేదంటే మార్చిలో రిలీజ్ చేసే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.
షూటింగ్ కంప్లీట్ అయిన కూడా తరువాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి మరికొంత సమయం పడుతుంది. అందుకే వచ్చే ఏడాదికి సినిమా రిలీజ్ వాయిదా వేసినట్లు టాక్. చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27న ఫిక్స్ చేశారు. ఓజీ రిలీజ్ కావాల్సిన డేట్ లోనే దేవర రాబోతోంది. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ ఓజీ వాయిదా పడిందని కన్ఫర్మ్ అవుతోంది. త్వరలో దీనిపై నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.