వాలంటైన్స్ డే రోజు పబ్ లో పాయల్ గొడవ..!
నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా సెలబ్రెటీలు తమ జీవిత భాగస్వామితో ఉన్న ఫోటోలు షేర్ చేశారు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పూత్. తన అందంతో పాటు అభినయం తో మరోసారి మంగళవారం అంటూ ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. సీనియర్ హీరో వెంకటేష్ కు జోడీగా నటించి కూడా మెప్పించిన పాయల్ లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచింది.
నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా సెలబ్రెటీలు తమ జీవిత భాగస్వామితో ఉన్న ఫోటోలు షేర్ చేశారు. కొందరు వారి లవ్ ను పరిచయం చేశారు. కొందరు మాత్రం ఆ ప్రత్యేక రోజులో కూడా వర్క్ లో నిమగ్నం అయ్యి ఉన్నారు.
తాజాగా పాయల్ రాజ్ పూత్ సోషల్ మీడియాలో తాను వాలంటైన్స్ డే రోజు షూటింగ్ లో ఉన్నాను అంటూ ఒక వీడియోను షేర్ చేసింది. అది కాకుండా ఆ వీడియోలో... పాయల్ ఒక పబ్ లో సీరియస్ గా ఒక వ్యక్తిని కొట్టిన సన్నివేశం చిత్రీకరణ జరిపారు. ఈ సన్నివేశం ఏ సినిమాలోనిది అనేది ఆమె మెన్షన్ చేయలేదు.
నేను షూటింగ్ లో ఉన్నాను. మరి మీరు ఏం చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి అంటూ సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన ఫాలోవర్స్ మరియు ఫ్యాన్స్ కి హ్యాపీ వాలంటైన్స్ డే చెప్పింది. సినిమాలు, సిరీస్ లతో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ అమ్మడు ప్రేమలో ఉన్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే పెళ్లి విషయాన్ని ఈ అమ్మడు క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో ఉంచింది.