సుకుమార్ కూతురుకి ఫాల్కే పురస్కారం
సుకృతి వేణి నటించిన 'గాంధీ తాత చెట్టు' అనే సినిమాలో ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను ఉత్తమ బాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంను దక్కించుకుంది.
స్టార్ దర్శకుడు సుకుమార్ తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెల్సిందే. పుష్ప తెలుగు తో పాటు దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప సినిమా తో బన్నీకి జాతీయ అవార్డు దక్కిన విషయం తెల్సిందే. ఇప్పుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి కి అత్యున్నత పురస్కారం దక్కింది.
సుకృతి వేణి నటించిన 'గాంధీ తాత చెట్టు' అనే సినిమాలో ఉత్తమ నటనను ప్రదర్శించినందుకు గాను ఉత్తమ బాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారంను దక్కించుకుంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో సుకృతి వేణికి ఈ అవార్డును అందజేశారు.
ప్రస్తుతం 8వ క్లాస్ చదువుతున్న సుకృతి వేణి నటించిన గాంధీ తాత చెట్టు సినిమాను పలు అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించారు. అన్ని చోట్ల కూడా సుకృతి వేణి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అంతే కాకుండా పలు అవార్డులను మరియు రివార్డులను సినిమాతో పాటు సుకృతి కూడా దక్కించుకుంది.
దుబాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, ఇండియన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ తొలి సినిమా బాల నటిగా సుకృతి అవార్డును దక్కించుకుంది. 11వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ఉత్తమ చిత్రంగా నిలిచిన గాంధీ తాత చెట్టుకు అవార్డు వరించింది.
పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశ్యం గా రూపొందిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ రైటింగ్స్ మరియు గోపీ టాకీస్ సంస్థలతో కలిసి నిర్మించారు. ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్థానం దక్కించుకోవడంతో పాటు అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమాకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది.
చిన్న వయసులోనే ఫాల్కే అవార్డును అందుకోవడం ద్వారా లెక్కల మాస్టర్ కి సరైన వారసురాలు అంటూ సుకృతి వేణిని సినీ జనాలు మరియు మీడియా వర్గాల వారు అభినందిస్తున్నారు. ముందు ముందు నటిగా సుకృతి మరిన్ని సినిమాలు చేయాలని అంతా కోరుకుంటున్నారు. సుకృతితో పాటు సుకుమార్ కుటుంబ సభ్యులు అందరికి కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.