అతింద్రీయ శక్తులతో తొలి పాన్ ఇండియా!
శాండిల్ వుడ్ నటుడు గణేష్ హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనుంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పినాక' అనే చిత్రం తెరకెక్కుతోంది. ధనుంజయ్ కిదే దర్శకుడిగా తొలి సినిమా.
పాన్ ఇండియాలో సౌత్ సినిమా సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రాలన్నీ భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ చిత్రాలే. 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్', 'సలార్',' కల్కి 2898', 'కేజీఎఫ్', 'పుష్ప' వీటన్నింటిలోనూ యాక్షన్ పీక్స్ లో ఉంటుంది. నేపథ్యాలు వేర్వేరు అయినా యాక్షన్ మాత్రం కామన్ గా హైలైట్ అవుతుంది. 'హనుమాన్', 'కార్తికేయ-2','కాంతార' చిత్రాల్లో మాత్రం సోషియా ఫాంటసీ సహా భక్తి భావాన్ని హైలైట్ చేసారు.
'కాంతార'లో మాత్రం కాస్త హారర్ జానర్ ని ని టచ్ చేసారు. కానీ పూర్తి స్థాయిలో అతీంద్రియ శక్తులన్న చిత్రాన్ని మాత్రం ఇంత వరకూ పాన్ ఇండియాలో తీసుకురాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా కన్నడ నుంచి అలాంటి సినిమా ఒకటి పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. శాండిల్ వుడ్ నటుడు గణేష్ హీరోగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనుంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పినాక' అనే చిత్రం తెరకెక్కుతోంది. ధనుంజయ్ కిదే దర్శకుడిగా తొలి సినిమా.
రిలీజ్ అయిన టైటిల్ టీజర్ తో హారర్ అంశాలతో ముడిపెట్టిన పిరియాడిక్ డ్రామాగా తెలుస్తుంది. అంతీద్రియ శక్తులతో కూడిన పీరియాడిక్ డ్రామా ఇది. గణేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈసినిమా కోసం ప్రత్యేకంగా ఓ కొత్త ప్రపంచాన్నే సృష్టించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ప్రేక్షకులకు ఓ కొత్త సినిమాటిక్ అనుభూతిని పంచుతున్నారు.
పుర్రెలతో కూడిన పోస్టర్...ఆ పుర్రెలపై గణేష్ ఎక్కి కూర్చోవడం వంటి సన్నివేశాలు భయానకంగా తీర్చి దిద్దినట్లు తెలుస్తోంది. కన్నడ నుంచి రిలీజ్ అవుతున్న మరో పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ఇప్పటికే కన్నడ నుంచి'కేజీఎఫ్' రిలీజ్ అయి ఎలాంటి సంచనలం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత అదే బ్యాక్ డ్రాప్ లో 'బఘీర' రిలీజ్ అయింది. కానీ అంచనాలు అందుకోలేదు. తాజాగా కొత్త నేపథ్యంతో వస్తోన్న 'పినాక' మరో పాన్ ఇండియా గా హైలైట్ అవుతుంది.