రివ్యూ : పిండం
నటీనటులు : శ్రీకాంత్ శ్రీరాం, ఖుషి రవి, ఈశ్వరి రావు, శ్రీనివాస్ అవసరాల, రవి వర్మ, మానిక్ రెడ్డి, బేబీ చైత్ర, బేబీ లైషా, విజయలక్ష్మి తదితరులు.
సంగీతం : కృష్ణ శౌరవ్ సురంపల్లి
సినిమాటోగ్రఫీ : సతీష్
నిర్మాత : యశ్వంత్ దగ్గుమాటి
రచన-దర్శకత్వం : సాయి కిరణ్ దైద
తెలుగులో ప్రస్తుతం హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ తరహా సినిమాలు ఈ ఏడాది వచ్చి ప్రేక్షకులను అలరించగా పిండం సినిమా మరోసారి అలాంటి ప్రయత్నం తో వచ్చారు. శ్రీకాంత్ శ్రీరాం లీడ్ రోల్ లో సాయి కిరణ్ దైద దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పిండం. ట్రైలర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
క్రిస్టియన్ ఫ్యామిలీ అయిన ఆంటోని (శ్రీరాం) అతని భార్య మేరీ (ఖుషి) తన ఇద్దరు పిల్లలు సోఫీ, తారా ఇంకా వారి గ్రాండ్ మదర్ తో కలిసి ఉంటారు. రైస్ మిల్ లో జాబ్ రావడంతో ఆంటోని కొత్త ఇంట్లోకి ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తాడు. అక్కడ కొన్ని సంఘటనలు అనుమానాస్పదంగా కనిపిస్తాయి. ఆంటోని కూతురు తార వింత వింతగా ప్రవర్తిస్తుంది. పరిస్థితి మరీ భయాందోళన కరంగా మారడంతో ఆంటోని భూత వైద్యురాలు అన్నమ్మ (ఈశ్వరి రావు)ని పిలుస్తాడు. ఇంతకీ అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది. తారాని పట్టి పీడిస్తుంది ఎవరు..? ఈ సమస్యల నుంచి వారు ఎలా బయటపడ్డారు అన్నది సినిమా కథ.
కథనం - విశ్లేషణ :
హర్రర్ థ్రిల్లర్ సినిమాలను రూపొందించడానికి ఎక్కువ బడ్జెట్ అవసరం ఉండకపోవచ్చు కానీ ఎంచుకున్న కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కావలసిన సామర్థ్యం కథనంలో ఉండాలి. ప్రేక్షకులను తెర మీద పాత్రలకు సన్నివేశాలకు కనెక్ట్ అయ్యేలా చేయాలి. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఆడియన్స్ ని ఎక్కువ థ్రిల్ చేయాల్సి ఉంటుంది. టేకింగ్ లో మార్కులు కొట్టడంలో విఫలమైతే మాత్రం ఇంప్యాక్ట్ ఉండదు. కథ కథనం పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. పిండం సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగేలా చేసింది. పిండం కొన్ని భాగాల్లో ఆకట్టుకుంటుంది ఎంచుకున్న కథను తెరకెక్కించడంలో మేకర్స్ పాక్షికంగా విజయం సాధించారు.
పిండం మూవీ ఆసక్తికరంగా ప్రారంభం అవుతుంది మొదట్లో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. పాత్రలను కూడా ఒక క్రమ పద్ధతిలోనే పరిచయం చేశారు. అయితే నెక్స్ట్ ఏదో జరగబోతుంది అని ఆడియన్స్ ఆశించేలా కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా నడిచినట్టు అనిపిస్తుంది. ఇంట్లో జరిగే సన్నివేశాలు తారాని స్వాధీనం చేసుకున దృశ్యాలు ఏవి అంతగా కొత్తగా అనిపించవు. కొన్ని సన్నివేశాలు ఇంతకుముందు థ్రిల్లర్ సినిమాల్లో చూసిన వాటిని గుర్తుచేస్తాయి. ట్విస్ట్ లు కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ అంతా అలా సాగిన సినిమా సెకండ్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పిండం ని నిలబెట్టేలా చేశాయి. ఎమోషనల్ సీన్స్ సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేశాయి. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా ప్రిడిక్టబుల్ గా అనిపించినా వర్క్ అవుట్ అయ్యిందనే చెప్పొచ్చు. హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ స్టోరీ ఎంత బలంగా ఉంటే సినిమా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పిండం కొద్ది మేరకు ఆ ప్రయత్నంలో సఫలమయ్యారని చెప్పొచ్చు. సినిమాలో చాలా థ్రెడ్స్ ఉన్నా వాటిని ఫ్లాట్ గా ముగించారని అనిపిస్తుంది.
ట్రైలర్ ని భయపెట్టేలా కట్ చేసిన డైరెక్టర్ సినిమాలో అంత భయపెట్టలేదు. ఫస్ట్ హాఫ్ డల్ గా సాగి ఓపికని పరీక్షించగా సెకండ్ హాఫ్ లో గ్రాఫ్ పెరిగేలా చేశారు. కొన్ని భయపెట్టే సీన్స్, పర్ఫార్మెన్స్, ఫ్లాష్ బ్యాక్, ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
నటీనటులు :
చాలా గ్యాప్ తర్వాత శ్రీరాం ఒక మంచి అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు తన బెస్ట్ ఇచ్చారు శ్రీరాం. ఖుషి రవి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నా అంత గొప్ప నటన కనబరచలేదు. సోఫీ, తార పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. ఈశ్వరి రావు పాత్ర బాగా డిజైన్ చేశారు. అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో బాగానే మెప్పించారు. మిగతా పాత్రదారులంతా పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం :
హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ చాలా అవసరం. ఇలాంటి సినిమాను నిలబెట్టాలంటే సాంకేతిక వర్గం పనితీరు బాగా ఉండాలి. పిండం సినిమా లో మ్యూజిక్ మంచి సపోర్ట్ గా నిలుస్తుంది. సినిమా మొదలినప్పటి నుంచి ఆడియన్స్ ని కథలో ఇన్వాల్వ్ చేసేలా సంగీతం సపోర్ట్ చేస్తుంది. కొన్ని సీన్స్ లో సౌండ్ ఎఫెక్ట్స్ కొంత భయాన్ని కలిగించేలా చేశాయి. అయితే సాంగ్స్ అంతగా మెప్పించలేదు. సినిమా విజువల్స్ బాగున్నాయి. ఇలాంటి సినిమాలకు లైటింగ్ అనుకున్న విధంగా ఉండాలి. ఎక్కువశాతం సినిమా ఇండోర్ లోనే కాబట్టి సినిమాకు కెమెరా మెన్ గా తన వంతు సహకారాన్ని అందించారు సతీష్. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే సినిమాకు ఇంకా ప్లస్ అయ్యేది. కొన్ని సీన్స్ డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. సీజీ ఎఫెక్ట్స్ నార్మల్ గానే ఉన్నాయి. డైరెక్టర్ సాయి కిరణ్ దైద సినిమాలు మొదలు పెట్టిన విధానం బాగున్నా మధ్యలో ట్రాక్ తప్పేశారు. కథనంలో వేగం లేదు. నటీనటుల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టగలిగారు ఎమోషనల్ సీన్స్ లో తన ప్రతిభ కనబరిచారు.
బాటం లైన్ : పిండం.. జస్ట్ ఓకే అనిపించే హర్రర్ మూవీ..!
రేటింగ్ : 2.25/5