పొలిమేర 2.. టార్గెట్ ఎన్ని కోట్లంటే?

కమెడియన్‌గా నవ్విస్తూనే మంచి పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యం రాజేశ్. అలా ఆయన ప్రధాన పాత్రలో గతంలో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర.

Update: 2023-11-03 05:42 GMT

కమెడియన్‌గా నవ్విస్తూనే మంచి పాత్రలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సత్యం రాజేశ్. అలా ఆయన ప్రధాన పాత్రలో గతంలో నటించిన చిత్రం మా ఊరి పొలిమేర. కరోనా సమయంలో ఓటీటీ వేదికగా విడుదలై సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్​గా ఆయనే ప్రధాన పాత్రలో మా ఊరి పొలిమేర 2 నేడు నవంబర్ 3 థియేటర్లలోకి వచ్చింది. ఇది కూడా మంచి థ్రిల్లింగ్​ పాజిటివ్​ టాక్​ను అందుకుంది.

ఈ సినిమాకు మంచి బిజినెస్సే జరిగిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఓవరాల్​గా బిజినెస్ రేంజ్ రూ.3.2 కోట్ల నుంచి రూ. 3.5 కోట్ల దాకా ఉంటుందని చెప్పాయి. అంటే ఇప్పుడు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్​ను అందుకోవాలంటే కనీసం రూ. 4 కోట్ల రేంజ్​కు కాస్త అటూ ఇటూగా షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంటుంది.

ఎలాగో మొదటి భాగం ఆడియెన్స్​కు విపరీతంగా నచ్చడంతో రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు దాదాపుగా థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పైగా ఇప్పుడు సీక్వెల్​కు పాజిటివ్​ రెస్పాన్స్ రావడం బాగా కలిసొచ్చింది. మరింత మంది ఆడియెన్స్​ పెరిగి వసూళ్లు బాగానే వస్తాయి అని చెప్పొచ్చు. ఈ లెక్కన చూస్తే.. మా ఊరి పొలిమేర 2 బ్రేక్ ఈవెన్ మార్క్​ను అందుకుంటుందనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, కామాక్షిభాస్కర్ల, బాలాదిత్య, రవి వర్మ, చిత్రం శ్రీను, సాహితి దాసరి, రాకెండు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. జ్యాని, కుశేందర్ రమేశ్ రెడ్డి మంచి సినిమాటోగ్రఫీని అందించారు. శ్రీ క్రిష్ణ క్రియేషన్స్ బ్యానర్​పై గౌర్ క్రిష్ణ సినిమాను హై వ్యాల్యూస్​తో నిర్మించారు.

రివ్యూ విషయానికొస్తే. మొదటి భాగానికి దీటుగా రెండో భాగాన్ని తెరకెక్కించారని ఆడియెన్స్ అభిప్రాయపడుతున్నారు. కథనం అత్యుత్తమంగా ఉందని చెబుతున్నారు. స్క్రీన్ ప్లై సూపర్ అని, అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం బాగుందంటు మార్కులు వేస్తున్నారు. బీజీఎం కూడా అదిరిపోయింది అంటున్నారు.

Tags:    

Similar News