త్రివిక్రమ్ తో వివాదం.. అసలు విషయం చెప్పిన పూనమ్!

దీనిపై కూడా పూనమ్ స్పందిస్తూ, 'మా'కు రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే, ఆమె కోరిన మహిళా ప్యానెల్ పై మాత్రం అసోసియేషన్ ఇంకా స్పందించలేదు.

Update: 2025-01-24 04:30 GMT

ఒకప్పుడు టాలీవుడ్ లో కాస్త బిజీగా కనిపించిన నటి పూనమ్ కౌర్ కొంతకాలం అనంతరం మెల్లగా ఇండస్ట్రీకి దూరమైంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఆమె ఎప్పటికప్పుడు పలు విషయాలపై స్పందించడం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా పరోక్షంగా ప్రముఖ దర్శకుడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ఆ పేరును నేరుగా ప్రస్తావించడంతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.

ఆమె చేసిన ఆరోపణలు, డిమాండ్లు ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. పూనమ్ కౌర్ ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు అసలు విషయం చెప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు చెప్పింది. కానీ ఆమె దీనికి ఓ షరతు పెట్టారు. ఆమె అభిప్రాయంలో మహిళలకు సంబంధించిన సమస్యలను మహిళా ప్రతినిధులే సరిగ్గా అర్థం చేసుకుంటారని, తాను మాట్లాడేందుకు 'మా' నుంచి ఓ మహిళా ప్యానెల్ కావాలని ఆమె కోరుతున్నారు.

తన సమస్యను సున్నితంగా, పారదర్శకంగా పరిష్కరించాలని ఆమె ఆశిస్తున్నారు. అయితే ఈ వివాదంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున శివబాలాజీ స్పందిస్తూ, ఇప్పటి వరకు పూనమ్ నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. ఫిర్యాదు లేకుండా అసోసియేషన్ సమస్యను ముందుకు తీసుకెళ్లడం సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. పూనమ్ ఆఫీస్ కు వచ్చి తన సమస్యను వివరించాలని ఆయన సూచించారు.

దీనిపై కూడా పూనమ్ స్పందిస్తూ, 'మా'కు రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే, ఆమె కోరిన మహిళా ప్యానెల్ పై మాత్రం అసోసియేషన్ ఇంకా స్పందించలేదు. ఇదే సమయంలో, పూనమ్ గతంలో చేసిన ఫిర్యాదు గురించి కూడా వివరించారు. తన ఫిర్యాదు లిఖిత పూర్వకంగా అందించినప్పటికీ, ఆ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు.

జానీ మాస్టర్ వివాదంలో ఎలా మహిళా ప్యానెల్ రంగంలోకి దిగిందో, తన విషయంలోనూ అలాంటి ప్యానెల్ అవసరమని ఆమె అభిప్రాయపడుతున్నారు. గతంలో తనపై ఎన్నో విమర్శలు, ట్రోలింగ్ వచ్చినా, తాను మౌనంగానే ఉండటం మంచిదని భావించానని ఆమె చెప్పారు. అయితే ఇంతకాలం మాట్లాడని పూనమ్, ఈసారి త్రివిక్రమ్ పై నేరుగా వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత తీవ్రతను సంతరించుకుంది. తాను మాట్లాడితే 'మా' నుంచి వచ్చిన స్టేట్ మెంట్ కరెక్ట్ గా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. అసోసియేషన్ పై తనకు నమ్మకం ఉందని, తమ సమస్యను పరిష్కరించగలదని ఆమె చెప్పారు.

Tags:    

Similar News