82 వయసు నటుడితో 33 వయసు అమ్మాయి!
అతడి వయసు 82.. కానీ మనసు 22. ఆమె వయసు 33 అయినా ఇంకా మనసు పదహారే.
అతడి వయసు 82.. కానీ మనసు 22. ఆమె వయసు 33 అయినా ఇంకా మనసు పదహారే. ఇప్పుడు ఆ ఇద్దరూ చేతక్ స్కూటర్ పై ఇలా సయరదాగా కలిసి ప్రయాణించారు. బహుశా ఇది ఒక ప్రకటన కోసం కావొచ్చు. అయినా ఆ ఇద్దరినీ అలా చూడగానే తాతయ్యతో మనవరాలి సరదా జ్ఞాపకాలు! అంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించేందుకు అవకాశం వచ్చినందున పూజా ఆనంధానికి అవధుల్లేవ్. ఇప్పటికే ఆ ఇద్దరూ కలిసి నటించిన వాణిజ్య ప్రకటన టీవీల్లో ప్రసారం అయింది. ఈరోజు బచ్చన్ జీ పుట్టినరోజు సందర్భంగా ఈ శుభ సమయాన పూజా సీనియర్ నటుడికి విషెస్ తెలిపింది. లెజెండ్ అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగానని పూజా ఎమోషనల్ నోట్ కూడా రాసింది. పూజా పూర్తి నోట్ సారాంశం ఇలా ఉంది.
``ఈ జాతీయ నిధి(నేషనల్ ట్రెజర్)కి జన్మదిన శుభాకాంక్షలు. లివింగ్ లెజెండ్ ఎప్పటికీ విస్మయం కలిగిస్తూనే ఉన్నారు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను.. ఆయన మోసుకెళ్ళే సౌరభాన్ని చూసి ఆశ్చర్యపోతూనే ఉన్నాను... నేను ఇప్పటికి ఆయనతో స్క్రీన్ స్పేస్‌ను షేర్ చేసుకున్నాను... ఒకే ఒక్కడు అమితాబ్‌బచ్చన్`` అంటూ పొగడ్తలు కురిపించింది పూజా హెగ్డే.
తెలుగులో ఛాన్సుల్లేవ్ ఎందుకు?
పూజా హెగ్డే టాలీవుడ్ జర్నీ గురించి తెలిసినదే. తెలుగు చిత్రసీమ అగ్ర హీరోలందరి సరసనా సినిమాలకు పనిచేసింది. వరుస పరాజయాల తర్వాత కొంత వెనకబడినా ఇప్పుడు మళ్లీ రేసులోకి వచ్చింది. ఇటీవల చాలా ఆఫర్లు వచ్చినా కానీ పారితోషికంలో తగ్గేదే లేదని అవివేకం ప్రదర్శించడంతో నిర్మాతలు పక్కన పెట్టారని కథనాలొచ్చాయి. దర్శకులు పూజాకు ప్రత్యామ్నాయ అవకాశాల కోసం వెతికారు. పూజా హెగ్డే డిమాండ్‌ల వల్ల గతంలో చాలా మంది నిర్మాతలు కూడా ఇబ్బందులు పడటంతో దీనిని సీరియస్ గా తీసుకున్నారు. తన వద్ద పని చేసే ఉద్యోగుల పరిహారం, ఫైవ్ స్టార్ హోటళ్లలో వసతి ఇతర ప్రయోజనాల గురించి నిర్మాతలను డిమాండ్ చేయడంతో వారు దీనిని విపరీతమైన ఒత్తిడిగా గుర్తించారు. వరుస పరాజయాల తర్వాత పూజా హెగ్డే వెంటపడే వారు కరువయ్యారు. దీనికి తోడు నవతరం నటీమణులు దూసుకురావడం కూడా పూజాకు చెక్ పెట్టినట్టయింది.
అయితే ఇటీవల కొన్ని ఆఫర్లు తన వెంటపడటంతో పూజా హెగ్డే పారితోషికాన్ని తగ్గించుకునే నిర్ణయం తీసుకుందని కథనాలొచ్చాయి. మునుపటితో పోలిస్తే కొంత తక్కువ పారితోషికానికే పని చేయడానికి అంగీకరిస్తోందట. పారితోషికం తగ్గడంతోనే దళపతి విజయ్ సరసనా అవకాశం వచ్చింది. దాదాపు సగానికి సగం పారితోషికం తగ్గించుకుని ఈ సినిమాలో నటిస్తోందని సమాచారం. అయితే ఇంత చేసినా పూజా హెగ్డేకి తెలుగు సినిమాల్లో ఆఫర్లు లేవు. పూజా హెగ్డేని ప్రస్తుతం ఏ తెలుగు నిర్మాత కొత్త సినిమా కోసం ఎంపిక చేయలేదు. పొడుగు కాళ్ల సుందరి తన పారితోషికాన్ని తగ్గించుకుంది. టాలీవుడ్‌కి తిరిగి రావాలని ఆలోచిస్తోంది కానీ పెద్ద ఆఫర్‌లు ఏవీ రాలేదు.