పూజా హెగ్డే.. తగ్గక తప్పట్లేదు..
ప్రస్తుతం ఆమె కెరియర్ చెప్పుకోదగ్గ స్పీడ్ లో లేదు. తమిళంలో సూర్యకి జోడీగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది.
పూజా హెగ్డే.. సౌత్ ఇండియాలో మొన్నటి వరకు ఒక రేంజ్ లో బిగ్ ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ వెళ్ళింది. కానీ అమ్మడి బ్యాడ్ లక్ ఏమిటో గాని చేసిన పెద్ద సినిమాలన్నీ దెబ్బ కొట్టాయి. కెరీర్ మొదటి నుంచి కూడా పూజ పాపతో లక్కు దోబూచులాడుతోంది. 2012లో మూగమూడి అనే తమిళ్ సినిమాతో పూజా హెగ్డే హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ సినిమా వచ్చిన రెండేళ్ల తర్వాత తెలుగులోకి ఒక లైలా కోసం సినిమాతో అడుగుపెట్టింది.
ఈ చిత్రంలో నాగ చైతన్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. నెక్స్ట్ ముకుంద సినిమాలో వరుణ్ తేజ్ తో జతకట్టింది. పూజా హెగ్డే మొదటి మూడు సినిమాలు సౌత్ లో పెద్దగా సక్సెస్ కాలేదు. హిందీలోకి మోహింజదారో సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ సినిమాలో హృతిక్ రోషన్ కి జోడీగా పూజా హెగ్డే నటించింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
మరల దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చిన పూజా మొదటి కమర్షియల్ హిట్ అందుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా జెట్ స్పీడ్ తో పూజా హెగ్డే కెరియర్ కొనసాగింది. 2022లో పూజా హెగ్డే నటించిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ప్రభాస్ రాధేశ్యామ్ కూడా ఉండటం విశేషం.
అయితే ఈ నాలుగు సినిమాలలో మూడు డిజాస్టర్ అయ్యాయి. బీస్ట్ మూవీ మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 2023లో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించిన కిసీకా భాయ్ కిసీకి జాన్ మూవీ రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది. అదే సమయంలో గుంటూరు కారంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో ఛాన్స్ లని పోగొట్టుకుంది.
ప్రస్తుతం ఆమె కెరియర్ చెప్పుకోదగ్గ స్పీడ్ లో లేదు. తమిళంలో సూర్యకి జోడీగా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోంది. చేతిలో సినిమాలు లేకపోవడం, ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాకపోవడంతో పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించేసిందంట. గత ఏడాది వరకు కోటి రూపాయిలకి పైగానే రెమ్యునరేషన్ తీసుకున్న పూజా హెగ్డే ఇప్పుడు కోటి కంటే చాలా తక్కువగానే తీసుకుంటుందంట. హిందీలో షాహిద్ కపూర్ కి జోడీగా దేవ్ అనే సినిమాని పూజా హెగ్డే కంప్లీట్ చేసింది.
ప్రస్తుతం ఆమె హోప్స్ అన్ని కూడా దేవ్ చిత్రం మీదనే ఉన్నాయి. తెలుగులో ఒక స్టార్ హీరో సినిమా కోసం పూజా హెగ్డేని ప్రముఖ నిర్మాణ సంస్థ సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాలో ఈ క్లారిటీ వస్తుందంట. సరైన కమర్షియల్ బ్రేక పడితే మరల కెరియర్ స్పీడ్ అప్ అవుతుందని పూజా హెగ్డే భావిస్తోందంట. మరి అలాంటి బ్లాక్ బస్టర్ రావాలంటే కొంతకాలం పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయక తప్పదు.