4కోట్లతో రేంజ్ రోవర్ కార్ కొన్న హీరోయిన్
హాట్ గాళ్ పూజా హెగ్డే ప్రస్తుతం ముంబై సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.
హాట్ గాళ్ పూజా హెగ్డే ప్రస్తుతం ముంబై సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్ పై పూర్తిగా కాన్ సన్ ట్రేట్ చేసిన పూజా ఈ దసరాకి అదిరిపోయే సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుంది. ఇటీవల సిల్వర్ రేంజ్ రోవర్ ఎస్‌యువిని కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని సమాచారం.
మీడియా కథనాల ప్రకారం.. ఈ కారు హై ఎండ్ లో లుక్ ఎంతో అద్భుతంగా ఉంది. వాహన గరిష్ట వేగ పరిమితి గంటకు 234 కి.మీ. 3.0-లీటర్ 6-సిలిండర్ ఇంజెనియం పెట్రోల్ ఇంజన్‌తో డిజైన్ చేసినది. ఇందులో 294 kW మోటార్‌తో కలిపి 404.5 kW శక్తిని అందిస్తుంది. ఈ వాహనం 13.1-అంగుళాల ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సౌకర్యవంతమైన హెడ్-అప్ డిస్ప్లే, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ .. ఎంటర్ టైనింగ్ బ్యాక్ సీటు స్క్రీన్ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో వస్తుంది. రేంజ్ రోవర్ ఇప్పుడు లాంగ్ వీల్‌బేస్ వెర్షన్‌తో ప్రత్యేకంగా అందుబాటులో ఉండే మూడవ-వరుస సీటును కలిగి ఉంది.
రకరకాల రంగుల్లో ఈ కార్ అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్ వెర్షనా డీజల్ వెర్షనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ కార్ సిల్వర్ రంగులో ఉంది. ఈ అద్భుతమైన రేంజ్ రోవర్ SUV తన గ్యారేజ్ లో రాజును తలపిస్తుందనడంలో సందేహం లేదు. పూజా హెగ్డే గ్యారేజ్ లో ఇప్పటికే పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆడి క్యూ7, జాగ్వార్ సెడాన్, పోర్స్చే కయెన్ , బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ సెడాన్ సహా ఇతర హై-ఎండ్ కార్లను కలిగి ఉంది. సందర్భాన్ని బట్టి పూజా తన ప్రయాణానికి కార్ లను ఎంపిక చేస్తుంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. పూజా ఇటీవల టాలీవుడ్ నుంచి దూరమైనా కానీ, బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన ఓ చిత్రం చేస్తోంది. అధికారికంగా దీనిని ప్రకటించారు. పూజా హెగ్డే బర్త్ డే సందర్భంగా టీమ్ పూజాకు గ్రాండ్ వెల్ కం చెప్పింది.