పూజా బేబీ లవ్ లో పడిందా.? పడేశారా..?

ఇంతకీ పూజాతో ప్రేమలో ఉన్న ఆ క్రికెటర్ ఎవరంటే మాత్రం చెప్పట్లేదు. పూజా ఏం చేసినా సరే ముంబై మీడియా ఒక కన్ను వేసి ఉంచుతుంది.

Update: 2023-09-25 10:08 GMT

బుట్ట బొమ్మ పూజా హెగ్దే లవ్ లో పడిందట. ప్రస్తుతం ముంబై మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. క్రికెటర్ తో పూజా బేబ్ ప్రేమలో ఉందని త్వరలోనే అమ్మడు పెళ్లి కూడా చేసుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా పూజాపై వస్తున్న ఈ న్యూస్ ఆమె ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్నాయి. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా సరే వాటి ఫలితాలు ఏవి పూజాకి హ్యాపీ నెస్ ని ఇవ్వలేదు. అసలే అక్కడ కెరీర్ కష్టంగా ఉందని భావిస్తున్న అమ్మడికి మళ్లీ ప్రేమలో ఉంది పెళ్లి చేసుకుంటుంది అంటూ న్యూస్ రావడం షాకింగ్ గా ఉంది.

ఇంతకీ పూజాతో ప్రేమలో ఉన్న ఆ క్రికెటర్ ఎవరంటే మాత్రం చెప్పట్లేదు. పూజా ఏం చేసినా సరే ముంబై మీడియా ఒక కన్ను వేసి ఉంచుతుంది. తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న పూజా పట్ల ముంబై మీడియా ఎప్పుడు ఏదో ఒక విషయం మీద టార్గెట్ చేస్తూనే ఉంది.

బాలీవుడ్ లో పూజా ఫెయిల్ అంటూ కథనాలు రాయడమే కాకుండా అన్ ఫిట్ ఫర్ బాలీవుడ్ అనే స్టోరీస్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లికి రెడీ అంటూ పూజాపై కథనాలు అల్లేస్తున్నారు.

సెలబ్రిటీస్ పర్సనల్ విషయాల మీద అసలేమాత్రం ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే తమకు తోచినట్టుగా రాసేయడం మీడియాకు అలవాటుగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ఇది ఎక్కువైంది నిజంగానే పూజా ప్రేమలో ఉంటే అది చెప్పేందుకు ఆమె అసలు వెనకాడదని చెప్పొచ్చు. మరి అలాంటిది ఆమెను ఓ హీరోతోనో, క్రికెటర్ తోనో లింక్ చేస్తూ వార్తలు రాయడం మాత్రం కరెక్ట్ కాదు..

ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుంటూరు కారం ఛాన్స్ వదులుకున్న తర్వాత మరో అవకాశం రాబట్టుకోలేని పూజా తెలుగులో ఎలాగైనా మళ్లీ వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. గుంటూరు కారం హీరోయిన్ ఛాన్స్ పోయినా ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందన్న టాక్ వినిపిస్తుంది.

టైర్ 2 హీరోల సినిమా అవకాశాలు వస్తున్నా పూజానే కావాలని వాటిని పక్కన పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి టఫ్ టైం లో వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి కానీ అలా కాదనుకుంటూ పోతే ఆమెకే రిస్క్ అని చెప్పొచ్చు. పూజా ఫ్యాన్స్ మాత్రం పెళ్లి వార్తలపై అప్సెట్ లో ఉన్నారు. పూజా మరికొన్నాళ్లు సినిమాలు చేయాలని వారు భావిస్తున్నారు.

Tags:    

Similar News