త‌ప్పు చేసాన‌ని ఫీల‌వుతోందా?

దీంతో కొన్ని నెల‌లు పాటు రెండు ప‌రిశ్ర‌మ‌ల్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చింది. కానీ ఇప్పుడా బ్యాలెన్స్ త‌ప్పిన‌ట్లు క‌నిపిస్తోంది.

Update: 2023-12-10 23:30 GMT

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే టాలీవుడ్ కెరీర్ జెట్ స్పీడ్ లో ఉండ‌గానే బాలీవుడ్ పైనా ఆశ ప‌డింది. వ‌రుస‌గా అవ‌కాశాలు కూడా అలాగే ద‌క్కించుకుంది. దీంతో కొన్ని నెల‌లు పాటు రెండు ప‌రిశ్ర‌మ‌ల్ని బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చింది. కానీ ఇప్పుడా బ్యాలెన్స్ త‌ప్పిన‌ట్లు క‌నిపిస్తోంది. ఫ‌లితంగా రెండింటికీ చెడ్డ రేవ‌డిలా స‌న్నివేశం క‌నిపిస్తోంది. 'గుంటూరు కారం'లో అమ్మ‌డు ఛాన్స్ ఎలా వ‌దుల‌కుందో తెలిసిందో.

ఇందులో అమ్మ‌డు మెయిన్ లీడ్ కి ఎంపికైంది. కానీ బాలీవుడ్ సినిమాతో డేట్లు క్లాష్ అవుతున్నాయ‌ని గుంటూరు కారం లో ఛాన్స్ వ‌దులుకుంది. ఇంత పెద్ద అవ‌కాశం ఎలా వ‌దులుకుంటుంద‌ని టాలీవుడ్ లో పెద్ద చ‌ర్చే సాగింది. ఇదే స‌మ‌యంలో బాలీవుడ్ లో అమె క‌మిట్ అయిన సినిమాలేవైనా ఉన్నాయా? అంటే అవి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న ప్రాజెక్ట్ లు ఏవైనా ఉన్నాయా? అంటే అదీ క‌నిపించ‌లేదు.

తాజాగా ఇటీవ‌లే మ‌ళ్లీ అమ్మ‌డు తెలుగు సినిమాల‌పై దృష్టి పెడుతున్న‌ట్లు క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఓ మూడు సినిమాల‌కు సంబంధించి ఇక్క‌డి ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెరపైకి వ‌చ్చింది. కొత్త ఏడాదిలో ఆ ప్రాజెక్ట్ లు అన్నింటికి ఒకేసారి సంత‌కం చేయ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అటుపై వాటి గురించి పూజా హెగ్డే అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నుంద‌ని వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో బుట్ట‌బొమ్మ‌లో త‌ప్పు చేసాను అన్న ఫీలింగ్ క‌నిపిస్తోంద‌ని ఆమె స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీక‌వుతుంది.

ఆమెలో ప‌శ్చాతాపం క‌నిపిస్తోంద‌ని... తెలుగు సినిమాలు కాద‌ని బాలీవుడ్ కి వెళ్ల‌డం లో త‌ప్పిద‌మంతా త‌న‌దే అన్న‌ట్లు ఆమె ఫీల‌వుతుంద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. ఏది ఏమైనా కంబ్యాక్ అనేది తెలివైన నిర్ణ‌యం. ఆశించిన చోట అవ‌కాశం రాలేద‌ని బాధ‌ప‌డ‌కుండా అవ‌కాశం వ‌చ్చిన చోగ‌ మ‌ళ్లీ తిరిగి రావ‌డం అన్న‌ది కెరీర్ ని ముందుకు తీసుకెళ్లే విష‌యంగానే ప‌రిగ‌ణించాలి. వ‌చ్చిన అవ‌కాశాల్ని వినియో గించుకోవ‌డం అన్న‌ది తెలివైన నిర్ణ‌యం.

Tags:    

Similar News