పిక్ టాక్ : బుట్టబొమ్మ కూల్ అండ్ స్వీట్
ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో బాలీవుడ్ కు వెళ్లింది.
2012 లో తమిళ చిత్రం ముగమూడి తో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగు లో ఒక లైలా కోసం మరియు ముకుంద సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకట్టుకోక పోవడంతో బాలీవుడ్ కు వెళ్లింది. అక్కడ చేసిన మొహంజదారో సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.
బాలీవుడ్ నుంచి మళ్లీ టాలీవుడ్ కు 'డీజే' సినిమాతో వచ్చింది. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు పూజా హెగ్డే కు మంచి పేరును తెచ్చి పెట్టింది. దాంతో టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
హీరోయిన్ గా పూజా హెగ్డే టాలీవుడ్ లోని దాదాపు అందరు స్టార్ హీరోలకు జోడీగా నటించింది. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడికి కాస్త అవకాశాలు తగ్గాయి. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తుంది కానీ ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బుట్టబొమ్మ అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేయడం తగ్గడం లేదు. ఈ మధ్య కాలంలో వరుసగా అందాల షో ఫోటోలు షేర్ చేయడం ద్వారా మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది.
ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ బుట్టబొమ్మ సొంతం. అందుకే ఫోటోలకు మంచి స్పందన వస్తుంది. సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఏ ఫోటో షేర్ చేసినా కూడా వెంటనే లక్షల్లో లైక్స్ మరియు షేర్స్ రావడం మనం చూస్తూనే ఉంటాం.
హీరోయిన్ గా ఇంత తక్కువ సమయంలోనే ఈ అమ్మడు కనుమరుగు అవ్వడం దారుణమైన విషయం అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సింపుల్ అండ్ స్వీట్ లుక్ లో క్లీ వేజ్ షో చేస్తూ పూజా హెగ్డే అందాల షో కి అంతా ఫిదా అవుతున్నారు.