పూజా పాప.. ఇది పర్ఫెక్ట్ గ్లామర్ బొమ్మ

అల్లు అర్జున్ సినిమాల ద్వారానే ఆమె కెరీర్ ఒక విధంగా యూటర్న్ తీసుకుంది అని చెప్పవచ్చు. డీజే సినిమా తర్వాత అల వైకుంఠపురములో సినిమా ఆమెను మరొక రేంజ్ కు తీసుకు వెళ్ళింది.

Update: 2023-11-16 17:28 GMT

కెరీర్ మొదట్లోనే ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు ఎదుర్కొన్న పూజా హెగ్డే ఆ తర్వాత మెల్లగా తన గ్లామర్ తో వెండితెరపై క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. అల్లు అర్జున్ సినిమాల ద్వారానే ఆమె కెరీర్ ఒక విధంగా యూటర్న్ తీసుకుంది అని చెప్పవచ్చు. డీజే సినిమా తర్వాత అల వైకుంఠపురములో సినిమా ఆమెను మరొక రేంజ్ కు తీసుకు వెళ్ళింది.


ఆ తర్వాత అగ్ర హీరోల నుంచి మరిన్ని ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అయితే పూజ బ్యాడ్ లక్ ఏమిటో కానీ బన్నీతో సినిమా చేసిన తర్వాత ఏ సినిమా కూడా ఆమె అంతగా ఉపయోగపడలేదు. కంటెంట్ విభిన్నంగానే ఉంటున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద ఆమె చేస్తున్న క్యారెక్టర్స్ మాత్రం బోల్తా కొడుతున్నాయి. ఇక చివరికి చేతిలో ఉన్న సినిమాలు కూడా జారిపోయే పరిస్థితి ఏర్పడింది.


దానికి తోడు పోటీగా మిగతా హీరోయిన్స్ కూడా ఉండడం వలన పూజా హెగ్డే రేంజ్ మెల్లమెల్లగా తగ్గుతుంది అనే విధంగా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియా ప్రపంచంలో మాత్రం తన గ్లామర్ తో మరింత ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకునే ప్రయత్నం అయితే చేస్తుంది.

ఇక రీసెంట్ గా ఫ్యాషన్ ట్రావెల్ అనే ఒక మ్యాగజైన్ లో ఆమె ఇచ్చిన ఒక స్టిల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు తన లెగ్స్ అందాలను మరింత హైలెట్ చేస్తూ కొంటె చూపుతో స్టిల్ ఇచ్చింది. గతంలో బికినీలో కూడా కనిపించిన పూజా హెగ్డే ఈ ఫోటోలో మాత్రం చాలా అందంగా ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక పూజ హెగ్డే గుంటూరు కారం సినిమాలో మొదట అవకాశం అందుకున్నప్పటికీ ఆ తర్వాత ఎందుకో ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో కిసి కా భాయ్ కిసి కి జాన్.. అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా కూడా దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆమె ఆశలు బాలీవుడ్ దేవా సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమాతో సక్సెస్ అందుకొని మరిన్ని అవకాశాలు పొందాలని చూస్తోంది.

Tags:    

Similar News