ఆ బ్యూటీ షాకింగ్ కామెంట్.. త్రివిక్రమ్ యూజ్ లెస్ అంటూ...
ఇదంతా పక్కన పెడితే.. పూనమ్.. అప్పుడప్పుడు సంచలన ట్వీట్స్ చేస్తుంటోంది. ఒక్కోసారి ఆమె చేసిన ట్వీట్లు.. పెద్ద పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి.
పూనమ్ కౌర్.. ఒకప్పుడు వరుస మూవీలు చేస్తూ బిజీగా ఉండేది ఈ హీరోయిన్. బాక్సాఫీస్ వద్ద ఆమె నటించిన పలు చిత్రాలు హిట్ కూడా అయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. సామాజిక, రాజకీయ కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పుడూ ఏదో విషయంపై స్పందిస్తూ ఉంటోంది. ఏదో ఒక వార్తతో హైలెట్ అవుతోంది.
ఇటీవల తాను ఒక అరుదైన వ్యాధి బారిన పడిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది పూనమ్ కౌర్. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఒక్కోసారి బట్టలు వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డట్టు చెప్పింది. రెండేళ్లుగా ఫైబ్రోమైయాల్జీయా అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ తో బాధపడుతున్నట్లు తెలిపింది. మంతెన సత్యనారాయణ సూచనలు తనను ఎంతగానో సపోర్ట్ చేశాయని చెప్పింది.
ఇదంతా పక్కన పెడితే.. పూనమ్.. అప్పుడప్పుడు సంచలన ట్వీట్స్ చేస్తుంటోంది. ఒక్కోసారి ఆమె చేసిన ట్వీట్లు.. పెద్ద పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా అలాంటి ట్వీటే చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ మీటింగ్ లో మాట్లాడిన స్పీచ్ వీడియోను ఓ మీడియా సంస్థ పోస్ట్ చేయగా.. దానికి స్పందించింది. యూజ్ లెస్ ఫెల్లో త్రివిక్రమ్ అని కామెంట్ పెట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన తన పార్టీ పొలిటికల్ మీటింగ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ప్రస్తావన తీసుకొచ్చారు. "వారు సిద్ధం అంటూ పోస్టర్లు పెట్టేశారు సార్ అని చాలా మంది నాకు చెప్పారు. మీరు కూడా అలా పెట్టమని అడుగుతున్నారు. కానీ అలాంటి డైలాగ్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది" అని పవన్ చెప్పారు.
ఆ సమయంలో అత్తారింటికి దారేది మూవీ టాపిక్ ను తీసుకొచ్చారు పవన్. "నా అత్తారింటికి దారేది మూవీలో త్రివిక్రమ్ రాసిన సింహం గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాను. నేను సింహం.. అది ఇది.. అలాంటి డైలాగులు నాకు చెప్పడం నచ్చదు అని త్రివిక్రమ్ కు చెప్పేశాను. దీంతో త్రివిక్రమ్ కామెడీగా చెప్పేయండని అన్నారు. కామెడీగా అయితే ఏదైనా చెప్పేస్తాను అంటూ ఆ డైలాగ్ చెప్పా" అని అప్పటి విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్, పూనమ్ కౌర్ మధ్య వివాదమేంటో ఎవరికీ తెలియదు. కానీ ఆమె ట్వీట్లు, కామెంట్లు మాత్రం సంచలనంగా ఉంటాయి. మరేం జరిగిందో వారికే తెలియాలి.