బాల రాముడి ప్రతిష్ట పూనమ్ ఇంట్లో పండగలా!
అనంతరం 'జై శ్రీరామ్' అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇంట్లో రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ వేడుకకు సంబంధించిన ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
పూనమ్ పాండే అంటే ఇన్ స్టాలో అందమైన ఫోటోలతో అభిమానుల్ని అలరించడమే కాదు. ఆమె గొప్ప భక్తురాలు అని చాలా మందికి తెలుసు. హిందు దేవుళ్లను ఆరాదించడంలో ఆమె ముందుకు వరుసలో ఉండేది. తాను చనిపోతానని తెలిసి కూడా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠను పూనమ్ పాండే ఓ గొప్ప పండగలా జరుపుకుంది. జనవరి 22న ఇంట్లో రామ జెండాను రెపరెపలాడించింది.
అనంతరం 'జై శ్రీరామ్' అనే క్యాప్షన్‌తో ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇంట్లో రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ వేడుకకు సంబంధించిన ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. శ్రీరాముడు వనవాసం ముగించుకుని ఇంటికి వచ్చినట్లే ..అయోధ్య శ్రీరాముడికి స్వాగతం పలుకుతుంది అంటూ ఆప్రత్యేకమైన రోజున చాలా మందికి రాముడి విగ్రహాలు కానుకగా పంచింది.
ఇంకా చిన్నారులకు మిఠాయిలు.. చిరు కానుకలు అందించింది. అలా పూనమ్ పాండే చేసి కార్యక్రమా లన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే అంజనేయ స్వామి జయంతిని పూనమ్ పాండే ఏటా ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకునేది. జై హమనుమాన్ అంటే ముంబై లో చక్కెర్లు కొట్టేది. ఉన్నంత కాలం ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపింది. బాలీవుడ్ లో మాత్రం నటిగా మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
కొన్ని సినిమాలకే పరిమితమైంది తప్ప! హైట్స్ కి చేరుకోలేకపోయింది. అయినా ఇన్ స్టాలో పూనమ్ ఓ ధృవతారగా వెలిగింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న నటి నేడు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఆమె జ్ఞాపకాలు తలుచుకుంటూ అభిమానులు శోకసంద్రంలో మునిగి పోయారు. పూనమ్ పాండేకి ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల మంది పూనమ్‌ను ఫాలోవర్లు ఉన్నారు.