నేను చనిపోయినా పర్వాలేదు.. పోసాని డెత్‌ ప్లాన్స్

పోసాని తాజాగా ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు ఎలాంటి దిగులు లేదు. తన కుటుంబం గురించి అసలు చింత లేదు

Update: 2023-08-21 08:48 GMT

రచయితగా, దర్శకుడిగా, విలక్షణ నటుడిగా మంచి పేరు దక్కించుకున్న పోసాని కృష్ణమురళి ఎప్పటికప్పుడు విభిన్నమైన అంశాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా మరోసారి పోసారి కృష్ణమురళి విచిత్రమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. తన డెత్‌ ను ప్లాన్ చేసుకున్నట్లుగా పోసాని చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆలోచన కలిగించే విధంగా ఉన్నాయి.

పోసాని తాజాగా ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు ఎలాంటి దిగులు లేదు. తన కుటుంబం గురించి అసలు చింత లేదు. ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా కూడా నా పిల్లలు సెటిల్‌ అలాగే నా భార్య పేరు మీద 50 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల ద్వారా నెలకు రూ.8 లక్షలు వస్తాయి.

ఆ డబ్బు తో ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా బతికేస్తుంది. కనుక నేను ఇప్పుడు చనిపోయినా కూడా బాధ లేదు. నేను చనిపోయినప్పుడు ఎలా ఉండాలో ముందే మా ఆవిడను ప్రిపేర్ చేశాను. ఆమె మరియు నా పిల్లలు ఏడవొద్దని చెప్పాను. నేను చనిపోతే ఇండస్ట్రీలో ఎవరికి కూడా చూపించొద్దని, ఏ ఒక్కరు నా చావు పట్ల సానుభూతి తెలపడం కానీ, మా ఆవిడకు సానుభూతి తెలియజేయడం కానీ చేయవద్దని కోరుకుంటున్నట్లుగా పేర్కొన్నాడు.

నాకు 63 ఏళ్లు, నా భార్య కు 60 ఏళ్లు. ఇంకా ఎన్నాళ్లు బతుకుతానో నాకు తెలియదు. బతికి ఉన్నా లేకున్నా కూడా నా ఫ్యామిలీ కి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా పోసాని పేర్కొన్నాడు. నిజంగానే చావు అనేది ఏ సమయంలో వస్తుందో... ఎలా వస్తుందో ఎవరు కూడా ఊహించలేరు. కనుక ముందస్తుగా ఇలాంటి ప్లాన్స్ చేసుకోవడం లో తప్పు లేదు అనేది కొందరి అభిప్రాయం కాగా... కొందరు మాత్రం పోసాని ఓవర్‌ యాక్షన్ అంటూ విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News