ప్రభాస్ బర్త్ డే ట్రీట్ ఇలా ప్లాన్ చేసారా?
విదేశాలు చెక్కిసి.. తనతో పాటు ప్రెండ్స్ గ్యాగ్ తో ఆస్వాదించడం డార్లింగ్ కి అలవాటు.
ప్రభాస్ పుట్టిన రోజు అంటే హడావుడి ఏ రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గ్రాండ్ పార్టీలతో అదరగొట్టడం అతడి స్పెషాల్టీ. ఈ విషయంలో డార్లింగ్ ఖర్చు విషయంలో ఏమాత్రం తగ్గడు. పిలిచి మరీ పార్టీలివ్వడం అన్నది ఇతడికే చెల్లింది. ఇక ప్రభాస్ బర్త్ డే బాష్ స్నేహితులతో అయితే వేరే లెవల్లో ఉంటుందనుకోండి. విదేశాలు చెక్కిసి.. తనతో పాటు ప్రెండ్స్ గ్యాగ్ తో ఆస్వాదించడం డార్లింగ్ కి అలవాటు.
మరి ఈసారి బర్త్ డేని ఏ దేశంలో ప్లాన్ చేసాడో? తెలియాలి. ఇక అభిమానులకు మాత్రం పెద్దగా ట్రీట్ ఏది ఉండక పోవచ్చు. `రాజాసాబ్` నుంచి ఏదైనా అప్ డేట్ రావొచ్చు. అలాగే `పౌజీ` నుంచి కూడా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు పక్కన బెడితే రీరిలీజ్ లతో మాత్రం డార్లింగ్ మరోసారి అభిమానుల్ని ఖుషీ చేస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్ సీజ్ ఫైర్` ని ఈనెల 19-20 తేదీల్లో RTC X రోడ్స్‌లో స్పెషల్ రీ-రిలీజ్ షోలు వేస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ సానుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే 22న `మిస్టర్ పర్ఫెక్ట్` రీ-రిలీజ్ జరుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మరోసారి థియేటర్లలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానుల కోసం ప్రభాస్ తొలి చిత్రం `ఈశ్వర్`ని కూడా థియేటర్లలో మళ్లీ చూసే అవకాశం కల్పించారు. అంతే కాదు భారీ యాక్షన్ చిత్రం `రెబల్` కూడా రీరిలీజ్ అవుతుంది. ఇది ఐదోసారి రిలీజ్ అవుతోంది.
ఇలా ఒకే ఏడాది ఇన్ని రీ-రిలీజ్ లు చేయడం డార్లింగ్ కే చెల్లింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగానే అభిమానుల కోసం ఇలా ప్లాన్ చేసారు. `సలార్`...`కల్కి 2898` విజయాలతో డార్లింగ్ పుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రెండు విజయాలకు ఇంకా కొనసాగింపు చిత్రాలున్నాయి. వాటిని వచ్చే ఏడాది మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ లో నటిస్తున్నారు. అలాగే హను రాఘవపూడితో వార్ బ్యాక్ డ్రాప్ లో పౌజీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.