ప్రభాస్ కోసం మరో క్యూట్ హీరోయిన్

టాలీవుడ్ నుంచి సినిమా రంగ ప్రవేశం చేసినా.. ఇప్పుడు దేశమే గర్వించే స్థాయికి ఎదిగిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్.

Update: 2024-10-17 15:30 GMT

టాలీవుడ్ నుంచి సినిమా రంగ ప్రవేశం చేసినా.. ఇప్పుడు దేశమే గర్వించే స్థాయికి ఎదిగిన హీరో రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ మధ్య కాలంలో ఏకధాటిగా భారీ చిత్రాల్లోనే నటిస్తోన్న అతడు.. మార్కెట్‌తో పాటు ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ జోష్‌లోనే అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా ప్రభాస్ వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది వచ్చిన ‘సలార్: సీజ్‌ఫైర్’ మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఏడాది ‘కల్కి ఏడి 2898’ సినిమాతో వచ్చాడు. ఇది కూడా భారీ రెస్పాన్స్ అందుకుని సత్తా చాటింది. ఫలితంగా ప్రభాస్ సినిమా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఇక, ఇప్పుడు ఈ బడా హీరో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ఫోకస్ చేస్తున్నాడు.

ప్రభాస్ ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘సలార్ 2’, ‘స్పిరిట్’ మూవీలను చేయనున్నాడు. ఇవి కాకుండా అతడు ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడితో కూడా ఓ మూవీని చేస్తున్నాడు. ఈ భారీ సినిమా వరల్డ్ వార్ నేపథ్యంతో సాగే ఓ స్వచ్చమైన ప్రేమ కథతో రూపొందనుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు సైతం కంప్లీట్ అయ్యాయి.

ప్రభాస్ - హను రాఘవపూడి చిత్రానికి సంబంధించిన అధికారిక రావడంతో పాటు ఈ ప్రాజెక్టు వివరాలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో అంశాలు తెరపైకి వచ్చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్ - హను మూవీలో మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. ఆమె ఎవరో కాదు.. మలయాళ చిన్నది నమిత ప్రమోద్.

వాస్తవానికి ప్రభాస్ సినిమాలో ఇమాన్వీ అనే భామ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ పాత్ర కోసం నమిత ప్రమోద్‌ను తీసుకున్నారట. గతంలో ఈ అమ్మడు ‘చుట్టాలబ్బాయి’, ‘కథలో రాజకుమారి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ప్రభాస్ చిత్రం ద్వారా నమిత మరోసారి టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది.

ప్రభాస్, హను కాంబోలో రాబోతున్న ఈ క్రేజీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. రెబెల్ స్టార్ నటిస్తోన్న ఈ మూవీని కూడా పాన్ ఇండియా రేంజ్‌లోనే చాలా భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

Tags:    

Similar News