ప్రభాస్.. ఏ లెవెల్లో కష్టపడుతున్నాడంటే?

ఓ వైపు కాలికి అయిన గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

Update: 2024-03-02 04:16 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తన మార్కెట్ ని మరింత పెంచుకుంటూ దూసుకుపోతున్నారు. ఏడాదికి రెండు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికోసం కనీసం విశ్రాంతి తీసుకోకుండా ప్రభాస్ కష్టపడుతున్నాడు. ఓ వైపు కాలికి అయిన గాయానికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరోవైపు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

ఈ ఏడాది కల్కి 2898ఏడీ మూవీతో ప్రభాస్ థియేటర్స్ లోకి రాబోతున్నాడు. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండటం విశేషం. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ ఒకటి ఈ ఏడాదిలోనే పూర్తి చేసి డిసెంబర్ లో లేదంటే వచ్చే ఏడాది జనవరికి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.

ఇవిలా ఉంటే మరల వచ్చే ఏడాది కోసం ఇప్పటి నుంచి సినిమాలు లైన్ లో పెట్టి షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్రభాస్ సిద్ధం అవుతున్నారు. ప్రశాంత్ నీల్ తో సలార్ పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది ద్వితియార్ధంలో స్టార్ట్ అవుతుందంట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది ఆఖరులో స్టార్ట్ అవుతుందని కన్ఫర్మ్ అయిపొయింది.

అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ లో ఒక మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందంట. ఈ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా ఒకే ఏడాదిలో మూడు సినిమాల షూటింగ్ లు స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు.

వీటికోసం చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ టూ బ్యాక్ షెడ్యుల్స్ ఫినిష్ చేయాలి. ఓ వైపు మారుతి సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిని బట్టి పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నాడో అర్ధం అవుతోంది. ఒక్కో స్టార్ ఒక సినిమా రెండేసి సంవత్సరాలు చేస్తూ ఉంటే పాన్ ఇండియా స్టార్ గా ఉంటూ ఒకే ఏడాదిలో రెండేసి సినిమాలు ప్రభాస్ ఆడియన్స్ కి అందిస్తున్నాడు.

Tags:    

Similar News