ఈ ఇద్ద‌రిపైనే స్టార్ హీరోకి ఎందుకంత గురి?

ఇప్ప‌టికీ ఆయ‌న ప్ర‌యోగాలు విడిచిపెట్ట‌డం లేదు.

Update: 2024-11-23 03:59 GMT

ప్ర‌యోగాలు చేయ‌డంలో కింగ్ నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న కెరీర్ తొలినాళ్ల నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించారు. ఆర్జీవీకి 'శివ' చిత్రంతో లైఫ్ ని ఇచ్చిన నాగార్జున త‌న కెరీర్ జ‌ర్నీలో చాలామంది ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసారు. ఎంద‌రో ఔత్సాహిక న‌టీన‌టులు, ర‌చ‌యిత‌లు, టెక్నీషియ‌న్ల‌ను కూడా నాగార్జున ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసారు.


ఇప్ప‌టికీ ఆయ‌న ప్ర‌యోగాలు విడిచిపెట్ట‌డం లేదు. త‌న పంథాలో ఎలాంటి మార్పు లేదు. జ‌యాప‌జ‌యాల‌కు అతీతంగా ట్రెండ్ కి అనుగుణంగా ఆలోచిస్తూ ఆయ‌న అక్కినేని లెగ‌సీని ముందుకు న‌డిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాగార్జున బాట‌లోనే నాగ‌చైత‌న్య కూడా ప్ర‌యోగాత్మ‌క సినిమాల‌తో ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌పోతే కింగ్ నాగార్జున నేటి జ‌న‌రేష‌న్ లో త‌న‌కు న‌చ్చే ఇద్ద‌రు ద‌ర్శ‌కుల గురించి ఇఫీ-2024 ఉత్స‌వాల్లో ప్ర‌స్థావించారు. తాను న‌టిస్తున్న కూలీ, కుబేర చిత్రాల గురించి ప్ర‌స్థావిస్తూ.. కుబేర‌ను తెర‌కెక్కిస్తున్న‌ శేఖ‌ర్ క‌మ్ముల

చాలా రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్ అని ప్ర‌శంసించారు. సినిమా మేకింగ్ పరంగా పూర్తి భిన్నంగా ఆలోచించే ద‌ర్శ‌కుడు అత‌డు. నేను ప్ర‌తిదీ ఎంజాయ్ చేస్తున్నాను.. ప్రయోగాలు చేస్తున్నాను అని అన్నారు. 'కూలీ' ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ప‌నిత‌నంపైనా ప్రశంస‌లు కురిపించారు. లోకేష్ జెన్ జెడ్ డైరెక్ట‌ర్ మాత్ర‌మే కాదు.. జెన్ జెడ్ ఫిల్మ్ మేకర్.. స్క్రీన్‌ప్లే స‌హా సాంకేతికంగా అత‌డు న్యూ ఏజ్ సినిమాలు తీస్తాడ‌ని ప్ర‌శంసించారు. అతడితో పనిచేయడాన్ని ఆనందిస్తున్నాను. అత‌డి సినిమాలో ఏదైనా పాత్రను పోషించడం చాలా స్వేచ్ఛనిస్తుంది. హీరో ఇలా ప్రవర్తించాలని, విలన్ ఇలా ప్రవర్తించాలని ఆయన రూల్స్ పెట్ట‌ర‌ని కూడా నాగ్ వ్యాఖ్యానించారు.

శేఖ‌ర్ క‌మ్ముల ల‌వ్ స్టోరి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించాక‌ చాలా స‌మ‌యం తీసుకుని 'కుబేర' లాంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఖైదీ, విక్ర‌మ్, లియో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల త‌ర్వాతా లోకేష్ ర‌జ‌నీకాంత్ - నాగార్జున‌ల‌తో కూలీ లాంటి భారీ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. క‌మ్ముల, లోకేష్ ఇద్ద‌రి దృష్టి పాన్ ఇండియా సినిమాల‌పైనే ఉంది.

ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల హిందీ మార్కెట్ పైనా గురి పెట్టారు.

Tags:    

Similar News