ప్రభాస్ ను డామినేట్ చేసేలా ఆ క్యారెక్టర్..
ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది.
ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిరోజు నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇక కల్కి సినిమాలో ప్రభాస్ నటన విశేషంగా మెప్పించింది. బౌంటీ హంటర్ పాత్రలో కనిపించిన ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో పాటు యాక్షన్ సీక్వెన్సులతో కూడా అదరగొట్టాడు. క్లైమాక్స్ లో పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ పోషించిన పాత్రలోని వినోదం, యాక్షన్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా కాలం తరువాత బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఒక ఫెస్టివల్ వాతావరణం అయితే కనిపిస్తోంది.
అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్రకు ఇన్సిపిరేషన్ తీసుకున్నారు. మహాభారతం నేపథ్యంతో అశ్వత్థామ పాత్రలోని ఎలివేషన్లు ప్రభాస్ పాత్రకంటే ఎక్కువగా ఉన్నాయి. అమితాబ్ యాక్షన్ సీన్స్ లో ప్రభాస్ ను డామినేట్ చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన పాత్రకు ఈ స్థాయి ఎలివేషన్లు ఇచ్చినందుకు నార్త్ జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేయడానికి ఈమాత్రం ఎలివేషన్స్ సరిపోతాయనే కామెంట్స్ వస్తున్నాయి.
ఇక మహాభారతం నేపథ్యం కల్కి సినిమాను మరింత ప్రభావవంతంగా మార్చింది. అశ్వత్థామ పాత్రతో సినిమా మొదలై, అదే పాత్రతో ముగియడం ప్రేక్షకులలో ఆసక్తి రేపింది. అమితాబ్ ఈ వయసులో కూడా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులను చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇక అమితాబ్ నటన, మేకప్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించినప్పటికీ, కథలో కీలకమైన ఆ పాత్ర అశ్వత్థామది కావడం తో అమితాబ్ పాత్రను మరింత ప్రత్యేకంగా నిలిపింది. మొత్తానికి, కల్కి 2898AD చిత్రం ప్రేక్షకులను అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సీన్స్, మంచి కథనంతో అలరిస్తోంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ నటనతో ప్రేక్షకుల్ని పరిపూర్ణంగా సంతృప్తిపర్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించేలా కనిపిస్తోంది.